Sunday, May 17

'కార్టూన్'

'కార్టూన్'!

అంటే, అది యెవరిని ఉద్దేశించి గీసారో, వాళ్ళు కూడా హాయిగా నవ్వుకోవాలి!

ఆర్కే నారాయణ్ లాంటివాళ్ళూ, బాపు లాంటివాళ్ళూ వేసిన కార్టూన్లు చూసి, జవహర్లాల్ నెహ్రూ లాంటి ప్రథానులూ, ముఖ్య మంత్రులూ అలాగే నవ్వుకొనేవారు!

ఈ మధ్య యేమిటో, ఈనాడు కార్టూనిష్ట్ శ్రీధర్ వెర్రితలలు వేస్తున్నాడు!

ఇవాళ (17-05-2009) వేసిన కార్టూన్ చూశారా?

పాపం చిరంజీవిని అల్లు అరవింద్ అడుగుతున్నాడు--"బావా! 'మార్పూ, సామాజిక న్యాయం' అని రెండు సినిమాలు తీద్దామనుకుంటున్నాను, వాటిలో నటిస్తావా?" అనో, ఆ అర్థం వచ్చేలాగానో!

మొదటి విడతో, రెండో విడతో పోలింగు అయిపోగానే, రాశ్శేఖర్రెడ్డి 'పథకాలు ' అమ్ముకుంటున్నట్లో...యేదో కార్టూన్ వేశాడు!

వీటినే కాదూ--'చెడు రుచి ' కార్టూన్లు (కార్టూన్స్ ఇన్ బేడ్ టేస్ట్) అంటారు?

శ్రీధర్! ఈనాడు స్థాయిని తగ్గించొద్దు! (ఓ పక్క ఉండవిల్లి అరుణ్ కుమార్ నెగ్గాడాయె!)

2 comments:

Anonymous said...

సార్ ఆర్కె నారాయన్ గారు పాపం కార్టూన్లు ఎప్పుడూ వెయ్య లేదు, అసలు బాపు గారి పేరు నెహ్రు వినే అవకాశమే లేదు, వాటిని సరిదిద్దుతే ఆర్కె లక్ష్మన్, శంకర్ పిల్లైలు అవుతారు.

A K Sastry said...

Dear Anonymous!

పొరపాటే! యెదో హడావిడిలో--ఆర్కే లక్ష్మణ్ బదులు నారాయణ్ అన్నాను!

ఇక బాపు గురించి అన్నది--క్రమాలంకారం--లక్ష్మణ్ ని నెహ్రూకీ, బాపు ని ముఖ్యమంత్రులకీ అన్వయించుకోవాలి!

ధన్యవాదాలు!