నా "తీర్మానాలు" .....
క్రొత్త సంవత్సరం సందర్భంగా, అందరూ కొన్ని తీర్మానాలు చేసుకుంటారు, అనీ జనవరి 3, 4,లేదా 7 లోగా, అవన్నీ మరిచిపోతారు అనీ, వాడెవడో "సర్వే" చేసి తేల్చాడట!!నేనుమాత్రం, జనవరి ఒకటిన కాకుండా, డిసెంబరు 31నే కొన్ని తీర్మానాలు చేసుకున్నాను!అవెన్ని? అని మీరు అడగకూడదు..... నేను చెప్పాకూడదు!విషయం ఏమిటి? .....అంటే, జనవరి ఒకటిన, అన్ని తీర్మానాలూ "అండర్లైన్"......అన్నీపాటించాను! హుర్రే!!రాత్రి 12 దాటగానే, (రెండో తారీఖు వచ్చేసిందికదా.... ) ఓ చిన్న తీర్మానాన్ని ప్రక్కన పెట్టేశాను.సరే, ఇవాళ రెండు. మధ్యాహ్నం 12 దాటాక, నా రెండో తీర్మానాన్ని కొంచెం రిలాక్స్ చేశాను!!!ఇప్పుడు రాత్రి....... ఏం చేస్తున్నానో, చేసానో..... "సస్పెన్స్!"ఇది, 2017 డిసెంబర్ 31 వరకూ...... "అద్భుతం, సస్పెన్స్, థ్రిల్!!!!వేచి చూడండి........!!
--ఈ టపా ఫేస్ బుక్ లో ప్రచురించగానే, నా చిరకాల మిత్రులు కూడా "అపార్థం" చేసేసుకున్నారు......అంటే, "సిగరెట్లు పూర్తిగా మానేస్తాను" లాంటి తీర్మానాలు చేసేసుకున్నానేమో అని! అందుకే, ఇప్పుడే సస్పెన్స్ విప్పెయ్యవలసి వస్తోంది! ఇంతకీ ఆ తీర్మానాలేమిటి? అంటారా......? అక్కడికే వస్తున్నా......!
కానీ, ఆ తీర్మానాల గుట్టు విప్పేటప్పుడు, ముందు నా దినచర్య గురించి టూకీగా చెప్పాలి మరి!
నేను రిటైర్ అయ్యాక, నా మిత్రులు చాలామంది అడిగేవారు.....కాలక్షేపం ఎలా చేస్తున్నారు? అంటూ. నేను, సర్వీస్ లో ఉన్నప్పుడు చక్కగా విశ్రాంతి దొరికేది, ఇప్పుడు ఉన్న సమయం అంతా సరిపోవడం లేదు.....అని సమాధానం ఇస్తే, ఆశ్చర్య పోయేవారు.
ఎలా.....అంటే, పేపర్ చదవడం దగ్గర్నుంచి, నెట్ లో గడపడం గురించి, రోజూ 5 పుస్తకాలు చదవడం గురించి, మిత్రులతో కాలక్షేపం గురించి, ఇంకా కొంత సమాజ సేవ గురించి.....చెపితే, భలే ఆశ్చర్య పోయేవారు!
ఇంకా వివరంగా అడిగినా, కొన్నిమాత్రమే వివరించేవాడిని. కాని ఇప్పుడు సమయం వచ్చింది.....ఇంకొంచెం వివరంగా చెపుతూ, టూకీగా చెప్పడానికి.
నేను ఎప్పుడూ చేసేది, "మల్టీ టాస్కింగే"! ఒకేపని కోసం సమయం వృధా చెయ్యను. ఆ కోణం లోనే అర్థం చేసుకోండి.....నా సమయాన్ని!
(మరో సారి!)
No comments:
Post a Comment