Sunday, April 29

నాకు నచ్చే.....



......నమ్మ బెంగళూరు

బెంగళూరు వాతావరణమంటే నాకిష్టం. 

ఇప్పుడిప్పుడు 'నమ్మ మెట్రో' వగైరా పేర్లతో చెట్లు నరికేసి, బయటికి వస్తే నెత్తీ అవీ, అన్నీ మాడేలా తయారయ్యిందిగానీ (అక్కడికీ పర్యావరణ ప్రేమికులు ధరణాలూ అవీచేసి లాఠీ దెబ్బలు తినడం, కోర్టులకెక్కడం, కోర్టులు అధికారులకి మొట్టికాయలు వెయ్యడం లాంటివీ, వందేళ్ల వయసు చెట్లని కూకటివేళ్లతో పెకలించి వేరే చోట్ల నాటడం లాంటివి జరుగుతున్నాయిగానీ, పెద్ద ప్రభావం వుండటం లేదు!), లేకపోతే స్వర్గానికి బెత్తెడు దూరమే! మన హైదరాబాదు, విజయవాడ, గుంటూరు, విశాఖ వగైరాలతో పోలిస్తే మాత్రం లక్ష రెట్ల బెటరు! అందుకే నాకిష్టం.

మొన్న మళ్లీ ఓ పదిరోజులు బెంగళూరు వెళ్లి వచ్చాము......మా అబ్బాయి మార్తహళ్లి లో కొనుక్కున్న అపార్ట్మెంట్ గృహ ప్రవేశం చేయించడానికి.

ఈసారి మాతో వచ్చిన, ఇంతవరకూ బెంగళూరు చూడని వాళ్లకోసం, కేటీడీసీ వాళ్ల "న్యూ బెంగళూరు" ప్యాకేజీలో తీసుకెళ్లాను. 

మొట్టమొదట, "ఇస్కాన్" టెంపుల్. ఒకప్పుడు దివ్యప్రభతో, ఇసకేస్తే రాలని జనంతో కిటకిటలాడే "దేవాలయం". (ఇదివరకటి నా టపా చదివి వుంటే, అక్కడ నూట యెనిమిదో యెన్నో--నీళ్ల మధ్య గుండ్రని తిన్నెలూ, వాటిమీదనుంచి--బలవంతపు బ్రాహ్మణార్ధంగా, హరేరామ, హరేరామ, రామ రామ హరే హరే; హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే అంటూ అందరినీ అరిపించడం (నేను హరే అల్లా; హరే యేసు అనడం) వగైరాలు గుర్తుండే వుంటాయి.

ఇప్పుడవేవీ లేవు. క్యూలు ఖాళీ, కేంటీన్లు ఖాళీ, గుడి ఖాళీ--ఒక్క కేటీడీసీ టూరిస్టులు తప్ప, అక్కడ భక్తిపారవశ్యాన్ని సూచించే వింత డ్యాన్సులు చేసే "భక్తులు" తప్ప, యెవరూ లేరు! 

ప్రసాదం మాత్రం వేడివేడిగా, రుచిగా వుంది. 

ఇంక అక్కడ చిన్న చిన్న కృష్ణుడి విగ్రహాలూ, ఫోటోలూ, పూసలదండలూ, వెండీ వగైరా కుందులూ, అనేక చేతి వుత్పత్తులూ--మామూలుగానే రేట్లు వందల్లో! (నేనే వాటికి అధికారినైతే, యేమాత్రం కక్కుర్తిలేకుండా అందరికీ వుచితంగా పంచిపెట్టించేవాణ్ని! అదేమీ బీదవాళ్లు కట్టిన గుడి కాదుకదా? పైగా వాళ్లు అక్కడ వ్యాపారం చెయ్యనఖ్ఖరలేదుకదా?)

(అక్కడే బ్రేక్ ఫాస్ట్. మాకు టైములేక పార్సెల్ చేయించుకున్నాము.)

యేదీ శాశ్వతం కాదు అన్నదానికి నిలువెత్తు సాక్ష్యంగా మిగిలిందీ గుడి!

తరవాత 1970 ల్లో కట్టిన--యేక శిలా హనుమాన్ విగ్రహం వుండే గుడీ, రాజరాజేశ్వరి (మధుర మీనాక్షి కాపీ) గుడీ. 

.........మిగతా మరోసారి

13 comments:

anrd said...

అవునండి , బెంగళూర్ వాతావరణం బాగుంటుంది. ఇస్కాన్ టెంపుల్ బాగుంటుంది. ఆ టెంపుల్ లో రకరకాల ప్రసాదాలు లభిస్తాయండి.

Anonymous said...

enduko iskon temple lo commercial ga untundi anthaa.
:venkat

సుజాత వేల్పూరి said...

అవునండీ, ఆలయం బాగుంటుంది. మేము బెంగుళూరులో ఉండగా ఎవరో చుట్టాలొస్తే తీసుకెళ్లాను. అప్పుడే నేను కూడా చూడ్డం. ప్రసాదం పేరుతో బోల్డు రకాలు తిండి..! అందులో బజ్జీలు,చోలే బతూరా...చాట్ ఐటములు ఉండటం ఆశ్చర్యం! అయినా శుచిగా శుభ్రంగా ఉంది.

అలాగే కృష్ణా యశోదల టీ షర్టులు ఇస్కాన్ వి నాకు చాలా ఇష్టం. వాటిని బహుమతులుగా ఇవ్వడానికి పిల్లల కోసం వెదుకుతుంటా

బెంగుళూరు సరే,బెంగుళూరుకి ఒకటి రెండు గంటల దూరంలో బోల్డు అందమైన ప్రదేశాలున్నాయిగా చూడ్డానికి! అవన్నీ ముగించి వేసవి అంతా అక్కడే గడిపేయండి మరి~!

A K Sastry said...

డియర్ anrd!

చాలా సంతోషం.

బై ది వే, మీ ఆనందం బ్లాగులో విషయాలు బాగున్నాయి.

కీపిటప్.

ధన్యవాదాలు.

A K Sastry said...

పై అన్నోన్!

యేకీభవించినందుకు సంతోషం.

ధన్యవాదాలు.

A K Sastry said...

డియర్ సుజాత!

చాలా కాలానికి మీ వ్యాఖ్య. చాలా సంతోషం.

ఇంకోరోజు మైసూరు సైట్ సీయింగ్ కి అందరినీ తీసుకెళ్దామంటేనే కుదరలేదు. తిరిగి వచ్చేశాము.

ధన్యవాదాలు.

Anonymous said...

ఇస్కాన్ టెంపుల్లో బయటకు రావాలంటే వాళ్ళ చిన్నా చితకా షాపులు చూడకుండా వచ్చే అవకాశంలేదు. ప్రసాదం బాగుందంటున్నారు... మరో సారి వెళ్ళినపుడు కాస్త భక్తిగా ఆరగించి చూస్తాను. :)

A K Sastry said...

డియర్ SNKR!

మరదేకదా......బయటికి దారి చూపించడం! మరి భక్తిలేకుండా ఆరగించినా ప్రసాదాలు బాగుంటాయి.

ధన్యవాదాలు.

బుల్లబ్బాయ్ said...

గృహప్రవేశమా? మనకా నమ్మకాలున్నాయా బాబాయ్?

A K Sastry said...

"గృహం"అంటూ కట్టుకొనో, కొనుక్కొనో--తరవాత అందులో నివసించడానికి--"ప్రవేశం" చెయ్యడానికీ, మన నమ్మకాలకీ సంబంధమేమిట్రా బుల్లబ్బాయ్?!

sri said...

mi blogs anni baagunnayi.....

sri said...

sir...nenu idivaraku mi posts konni chadivaanu..naaku nachayi....konta gap taruvaata malli miru vraastunnanduku nenu happy...
Adabala Srinivasarao....Elamanchili(west godavari)..

A K Sastry said...

డియర్ Sri!

మీకు నచ్చుతున్నందుకు నాకూ చాలా సతోషం.

తరచు వ్రాయడానికి ప్రయత్నిస్తాను.

ధన్యవాదాలు.