......కోరితే
మొన్నీమధ్య, మావాడు (సన్నిహిత బంధువు) తో "ఛాట్" చేస్తూ, "ఇన్షా అల్లా" అని యేదో వ్రాశాను. దానికి వాడు "బాబాయ్! మతం మార్చావా? యెప్పుడూ?" అని క్రొశ్నించాడు. వెంటనే నేను, "అసలు పై వాడనేవాడొకడు వుండేడిస్తే, మనం యేపేరుతో పిలిచినా పలక్క ఛస్తాడా? ఈ మాత్రానికి మతాలూ, మార్పిళ్లూ యెందుకు?" అనగానే, అటునుంచి....అహ్హహ్హహ్హ!
నిజంగా, ఉర్దూలో ఆమాట నాకు చాలాబాగా నచ్చుతుంది. మిగిలినభాషల్లో అలాంటి "సంక్షిప్త" మహార్థాలిచ్చే మాటలు లేవు. ఇంగ్లీషులో బై గాడ్స్ గ్రేస్ అనీ, తెలుగులో దేవుడు మేలు చేస్తే అనీ, హిందీలో అగర్ భగవాన్ చాహే.....ఇలా యెన్ని వున్నా, ....."దేవుడు కోరితే", "దేవుడు అనుమతిస్తే", "పైవాడి శెలవైతే".....లాంటి అర్థాలు చెప్పే ఈ మాటకి సాటి అయినది లేదు!
అందుకే......"ఇన్షా అల్లా!"
6 comments:
బాగా చెప్పారు!
ఆచార్యులవారూ!
చాలా కాలనికి ఓ గుక్కెడు టానిక్ పోశారు.
చాలా సంతోషం.
ధన్యవాదాలు.
Holy Cow !!
You too ... Honour other Religions ?
Nice !!
అసలు మనిషిని మించినది ఉంది అని నమ్మేవారితో తగువు లేదండీ! దేని మీద నమ్మకం లేని వారితోనే భయం.
డియర్ ahmisaran!
పొరపాటు.....! పరమత సహనం, ఆదరణ కాదు. అసలు మత ప్రసక్తి లేదు నాకు.
సంతోషం.
ధన్యవాదాలు.
డియర్ kastephale!
".....వుంది" అని భయపెడుతూ, వేలం వెర్రులని ప్రోత్సహిస్తూ, ఆహార పదార్థాలనీ, వస్త్రాలనీ పాడు చేస్తూ, వ్యాపారాలు చేసే వారంటే నాకింకా భయం!
చాలా సంతోషం.
ధన్యవాదాలు.
Post a Comment