Monday, November 21

కొలతలూ......2



......మానాలూ

మనదేశంలో 20వ శతాబ్దం మొదట్లో కూడా, గవ్వలకి కూడా (చిల్లి గవ్వలకీ, గుడ్డి గవ్వలకీ కూడా!) విలువ వుండేది!

ఢిల్లీ పరిపాలకుడు షేర్షా సూరీ అనుకుంటా--దేశం మొత్తమ్మీద "నాణాలని" ప్రవేశపెట్టాడు. 

సముద్ర గుప్తుడూ వగైరాలు అప్పట్లో బంగారునాణాలు చలామణీలోకి తెచ్చారు.

బ్రిటీష్ వాళ్లు ద్రవ్యం "లీగల్ టెండర్" ప్రవేశపెట్టి, నాణాలూ, నోట్లూ ముద్రించేవారు (అంతకు ముందు నోట్లు లేవు--ఒక్క తుగ్లక్ విడుదలచేసిన 'తోలు' నోట్లు తప్ప!).

మా చిన్నప్పుడు "విచ్చు రూపాయి" అని ఖచ్చితంగా ఒక్క తులం వెండితో ఒక రూపాయి నాణాలు వుండేవి. ఒక సారి మా వైజయంతీ హాలులో నేను సినిమా టిక్కెట్లు తీసుకొన్నప్పుడు చిల్లర తిరిగి ఇస్తూ, ఓ వెండి రూపాయిని కూడా మామూలు వాటితో ఇచ్చేశాడు. (అది ఇప్పటికీ మా అమ్మగారు తన డబ్బుల పెట్లో జాగ్రత్త చేశారు!)

మహమ్మదీయ రాజులు ప్రవేశపెట్టిన నాణాల్లో అతి చిన్నది "దమడీ" (దమ్మిడీ) అనుకుంటా. తరవాత కాణీ, యాగాణీ--ఇలా వుండేవనుకుంటా నాణాలు. (దమ్మిడీ ముండకి యాగాణీ క్షవరమా? అనే సామెత అప్పుడు పుట్టింది--ఇప్పటికీ వాడుకలో వుంది!)

నా చిన్నప్పటి నాణాలూ, నోట్లూ విషయానికొస్తే.......

ద్రవ్యానికి (డబ్బుకి) మానం :

2 కాణీలు = ఒక అర్థ అణా
2 అర్థణాలు = ఒక అణా
2 అణాలు = ఒక బేడ
2 బేడలు = ఒక పావలా
2 పావలాలు = ఒక అర్థ రూపాయి
2 అర్థరూపాయలు = ఒక రూపాయి

ఒకరూపాయి నాణాలూ, నోట్లూ కూడా వుండేవి. తరవాత రెండూ, ఐదూ, పదీ, వందా, వెయ్యీ--మాత్రమే నోట్లు వుండేవి. పాత సినిమాల్లో ఇవన్నీ చూడొచ్చు.....వినొచ్చు!  

.....కొనసాగింపు మరో టపాలో

2 comments:

Unknown said...

కృష్ణశ్రీ గారు మీ బ్లాగ్ లో ఈ సమాచారం బావుందండి.మొత్తం చదివి కామెంట్ పెడతాను.

A K Sastry said...

డియర్ kallurisailabala!

టపా నచ్చినందుకు సంతోషం.

మీతో, మీ బ్లాగ్ తో పరిచయం చాలా సంతోషం!

చక్కగా వ్రాస్తున్నారు. కొనసాగించండి.

బైదివే, కల్లూరి గోపాలరావుగారు మీకేమైనా.....?

ధన్యవాదాలు.