మొన్నటి మా యాత్ర
ఈ మధ్య ఒకటి రెండు తప్ప, వరసగా టపాలు వ్రాయలేకపోయాను. యెందుకంటే.....మీరు సరిగ్గానే వూహించారు.....దేశమ్మీద తిరగడానికి పడ్డాను.
హర్యాణాలో వుంటున్న మా ఆఖరు చెల్లెలు యెప్పటినించో రమ్మంటుంటే, వుద్యోగం లో సెలవలు లేవని వాయిదా వేస్తూ వచ్చాను. ఇప్పుడు వుద్యోగానికి గుంటకట్టి గంటవాయించాను కాబట్టి, సరదాగా తిరిగొద్దామని బయలుదేరాను.
మా రెండో చెల్లెలు, బావగారు కాకినాడ నుంచి బయలుదేరతామనడం తో, మార్చి 3వ తారీఖున "నిజాముద్దీన్ లింక్/దక్షిణ్ ఎక్స్ ప్రెస్" కి సామర్లకోటనించి నలుగురికీ రిజర్వేషన్ చేయించాను.
రెండో తారీఖుని మా కారులో బయలుదేరి, ఆ రాత్రి కాకినాడలో చిన్న చిన్న షాపింగులు చేసుకొని, ఆ మర్నాడు మధ్యాహ్నం 3-30 గంటలకి సామర్లకోట బయలుదేరాము. రైలు 4-20 కి. కొంచెం లేటుగా వచ్చి, సుమారు 5-00 కి బయలుదేరింది మా రైలు.
ఢిల్లీ, హర్యాణా, హిమాచల్, యూపీ, రాజస్థాన్‌లు తిరిగి, మొన్న 24 న మధ్యాహ్నం 2-30 కి తిరిగి సామర్లకోటచేరి, కాకినాడలో ఆ రాత్రి వుండి, మర్నాడు వుదయం బయలుదేరి ఇంటికి వచ్చాము.
మిగతా ఒక్కొక్క టపాలోనూ వ్రాయడానికి ప్రయత్నిస్తాను.
4 comments:
Please publish travel details about North India.
సుదీర్ఘ పర్యటనే మీది. మీ యాత్రా విశేషాలకొసం ఎదురు చూస్తాము.
పై అన్నోన్!
వెళ్లింది వుత్తర దేశమే కాబట్టి, అదే వ్రాస్తాను.
సంతోషం.
డియర్ cbrao!
మామూలు ట్రావెలోగ్ లా కాకుండా కొంచెం వెరయిటీ గా వ్రాద్దామని. మీకు నచ్చుతుందనే నమ్మకం.
ధన్యవాదాలు.
Post a Comment