ముగ్గురు ముసలి మూర్ఖులు
ఒకళ్ల రహస్యాలొకళ్లు భలే బయట పెట్టేసుకొంటారు--ఆ ముగ్గురూ!
ఓ సారి ఒకాయన రష్యాలో అధ్యక్ష భవనం ముందర నుంచొని, గట్టిగా, "బ్రెజ్ నెవ్ వట్టి మూర్ఖుడు!" అని గట్టిగా అరిచినందుకు, 1+15 సంవత్సరాలు జైలు శిక్ష వేశారట. అలా యెందుకు అని అడిగితే, అధ్యక్షుణ్ణి తిట్టినందుకు ఒక సంవత్సరం, జాతీయ రహస్యాన్ని బయటపెట్టినందుకు 15 సంవత్సరాలూ అని జవాబిచ్చారట!
అలాగ--మొన్నోసారి కాకా "సోనియా షుడ్ గో" అని అని కరాఖండీగా చెప్పేశాడు.
వెంటనే, కేకే, ఆయన నోట 'వినరాని మాటలు' వినవలసి వచ్చింది అనీ, ఆయన 'యేమి మాట్లాడుతున్నారో ఆయనకే తెలియని స్థితిలో' మాట్లాడారు అనీ, 'కన్ఫ్యూజ్డ్, డిస్టర్బ్ డ్ మైండ్ తో' వున్నట్టు కనిపిస్తోంది అనీ, 2-3 యేళ్లక్రితం కేవీపీ సోనియాకి డబ్బుల మూటలు పంపిస్తే, ఆయన 'అప్పుడే యెందుకు మాట్లాడలేదు?' అనీ, చెరిగేశాడు.
ఇంకోడు--వీ హెచ్, 'రాష్ట్రపతి పదవి ఇవ్వలేదనే అక్కసు తోనే' ఆయన అలా మాట్లాడడనీ, 'ముదిమి మీద పడడంతో' అలా మాట్లాడాడనీ, 'బాగా తిని, అబ్బే యేమీ తినలేదు' అన్నట్టు ఆయన వ్యవహారం వుంది అనీ, రాజ్యసభ సభ్యులుగా తామందరూ 'ఏకగ్రీవంగా' యెన్నిక కావడానికి 'చిరంజీవే కారణం' అనీ, ఒక్క యెన్నికలోకూడా పోటీ చెయ్యని తెరాస తో పొత్తుకు 2004 లో 'నువ్వెలా వెళ్లావు?' అనీ, ఇలా మండిపడ్డారు.
నిన్న (20-02-2011), 'గవర్నరు తెలంగాణా ప్రజలని మానసికంగా హింసించబట్టీ', బయట ప్రజలంతా 'సహయనిరాకరణలో తలమునకలై' వీధుల్లో వుంటే, తన ప్రసంగంలో గవర్నర్ కనీసం తెలంగాణా ప్రసక్తికూడా తేవకపోవడమే వాళ్లకి మానసిక హింస అనీ, బయట వున్నవాళ్లకే అంత బాధ వుంటే, లోపల వున్న ఎమ్మెల్యేలకి యెంతబాధ వుంటుందో కదా, అందుకే వాళ్లు 'అలా చేశారు' అనీ, అలా అని వాళ్లని తాను సమర్థించను అనీ, జేపీ సభలో చర్చిల్ ని పొగిడాడు అనీ, అసెంబ్లీ 'గూండాల అడ్డా'గా మారిందని అన్నాడనీ, అందుకే వాళ్లు 'అలా చేశారు' అనీ, మరి గూండాలూ, వెధవలూ వున్న సభలో ఆయన ఎందుకు వున్నారు? అనీ, ఆయనతోపాటు ఎమ్మెల్సీ పాలడుగు వెంకట్రావుని కూడా కొట్టినా, దానిగురించి యెవరూ మాట్లాడలేదు అనీ "ఆవేదన చెందారు"ట.
ప్రసంగం అనేది యెవరుచేసినా, తమ వుద్దేశ్యాన్ని సభాసదులకి వెల్లడించడానికే అనీ, తన ప్రభుత్వం అనుసరించబోయే విధానాల గురించిమాత్రమే ఆయన చెపుతాడనీ, అందులో తెలంగాణా గురించో, తోటకూర గురించో మాట్లాడవలసిన అవసరం లేదనీ, అలామాట్లాడాలని కోరే హక్కు యెవరికీ లేదనీ, అంతకు వారం రోజులముందునించీ, తెరాస వాళ్లు గవర్నరు ప్రసంగాన్ని అడ్డుకుంటాము అనీ, ప్రసంగ ప్రతులు చించి వాడి ముఖాన కొడతాము అనీ, ప్రసంగం సాగకుండా బలప్రయోగమైనా చేస్తాము అనీ ప్రకటిస్తున్నారు అనీ, వాళ్ల ప్రజలు చేస్తున్న సహాయ నిరాకరణల్లా, బస్సుల్లో టిక్కెట్టు కొనకుండా ప్రయాణించడమే అనీ, జేపీ యెంతమందికి, యెలాంటివాళ్లకి నాయకుడైనా, గూండాగా మారక తప్పదని హెచ్చరిస్తున్నాననీ, పాలడుగుని కొట్టినా తప్పులేదుగానీ, దాన్ని గురించి మాట్లాడకపోవడం పెద్ద తప్పనీ, ఇలాంటి మాటలవల్ల మీడియా వాళ్లముందూ, ప్రజలముందూ తనకి 'మతిస్థిమితం లేదు' అని ప్రకటించుకుంటున్నాను అనీ--ఆయన మరిచిపోతూంటాడు.
వీటినిబట్టి మనం అర్థం చేసుకోవలసినది యేమిటీ?
"పోవయ్యా! నువ్వేమిటి అర్థంజేసుకొనేది! మేము యేదో మాట్లాడతాం. కోడిగుడ్డుకి ఈకలు పీకడం యెందుకు? రేపు మళ్లీ మేమే ఖండించుకుంటాం.....ఆమాత్రానికి నీ టపా వోటి.....పోవయ్యా" అంటారు ఆ 'త్రయం'. నాకు తెలుసు.
(వీళ్ల గురించి సోనియాకి యెవరూ సరిగ్గా చెపుతున్నట్టు లేదు. చెప్పివుంటే ఈపాటికి ఒకడు తిహార్ లోనూ, ఒకడు చంచల్ గూడా లోనూ, ఒకడు చర్లపల్లి లోనూ వూచలు లెఖ్ఖపెడుతూ వుండేవారేమో!)
9 comments:
బాగా రాశారు. కాకపోతే చివర్న బ్రాకెట్లో రాసిన దానితో నేను కొద్దిగా విభేదిస్తున్నా..
నేననుకోవడం..
(వీళ్ల గురించి సోనియాకి యెవరూ సరిగ్గా చెపుతున్నట్టు లేదు. చెప్పివుంటే ,ఈపాటికి ముగ్గురూ ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రిలో జాయిన్ అయి, అక్కడి పిచ్చివారికి నేనంటే,నేను పెద్ద నాయకున్నని వారిలో వారు కొట్టుకుంటూ ఉండేవారు)
correct opinion
i appreciate
"వీళ్ల గురించి సోనియాకి యెవరూ సరిగ్గా చెపుతున్నట్టు లేదు."
The above statement is wrong!. How?
Answer: Sonia knows very well about each and every one of such anti-nationals.
Sonia needs the tacit help of such idiots to rule India with iron hand.
How else a single Italian (single white person) can rule one Billion people that to in a Democratic setup.
డియర్ cheekati!
ఆలస్యంగానైనా మీతో పరిచయం సంతోషం!
నిజంగా మీరన్నట్టు జరిగే అవకాశం కూడా వుంది!
మీ టపాలు బాగున్నాయి. చాలా "సమతూకంతో" వ్రాశారు. పరంపర కొనసాగించండి. "టార్చి" ని గమ్యం చేరడానికి ఇంకా ప్రయత్నించండి.
ధన్యవాదాలు.
మొదటి అన్నోన్!
సంతోషం!
తరవాతి అన్నోన్!
సోనియా తన "ఇనుప చేత్తో" పరిపాలించడానికి ఇలాంటివాళ్ల "సహాయం" అవసరమేనంటారా?
పోనీలే పాపం......ఇంకెన్నాళ్లు వుంటారో.....వాళ్లతో రోజూ గొడవలెందుకు! వాళ్ల యేడుపు భరించడం యెందుకు అని వై ఎస్ ఆర్ అనుకోకపోతే, వీళ్లకి ముష్టి పదవులు కూడా వుండేవి కాదనుకుంటా!
:) బాగుంది..
డియర్ కృష్ణప్రియ!
చాలా సంతోషం.
ధన్యవాదాలు.
rakthacharithra!
యె పి వా ఆ కదా!
కానివ్వండి.
Post a Comment