Friday, January 30

“ఫుట్ బాల్”

మా చిన్నప్పుడు ఫుట్ బాల్ ఆడేవాళ్ళం!

మరీ చిన్నప్పుడు టెన్నిస్ బాల్ తో, ఎలిమెంట్రీ స్కూల్లో వున్నప్పుడు యెప్పుడో వారానికో, 15 రోజులకో ఒకసారి డ్రిల్లు పీరియడ్ లో, మా స్కూలు వెనక ఉన్న పుంతలో, యేరంగుదో తెలియని నిజం ఫుట్ బాల్ తో, హై స్కూల్ లో నిజం గ్రౌండ్ లో, నిజం ఫుట్ బాల్ తో, నిజం గా—ఇలాగ! కాలేజీకి వచ్చాక చిత్రంగా హాకీ లోకి మారి పోయే వాళ్ళం!

ఇప్పుడు యెవరన్నా ఆడుతున్నారో లేదో తెలీదు.

ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా దీన్ని ‘సాకర్’ అనే వ్యవహరిస్తున్నారు.

ఇంతకీ, నేను మొదలుపెట్టింది ఆ ఫుట్ బాల్ గురించి కాదు!
అమెరికా ప్రెసిడెంట్ దగ్గర వుండే “ఫుట్ బాల్” గురించి!

అమెరికా సర్వ సైన్యాధ్యక్షుడుగా ప్రెసిడెంట్ ఒక్కడే అణ్వాయుధ ప్రయోగం పై చివరి నిర్ణయం తీసుకో వచ్చు—అంతే కాదు వాటి ప్రయోగాన్ని ప్రారంభించవచ్చు! ఆ ప్రారంభాన్ని చేసేదే ‘ఫుట్ బాల్’! ప్రెసిడెంట్ శరీరాన్ని యెల్లప్పుడు అంటి పెట్టుకొనే వుంటుంది ఆ పరికరం!

మాజీ ప్రెసిడెంట్ రోనాల్డ్ రీగన్ తుపాకి తో కాల్చబడి, చావు బతుకుల్లో వుండగా, పెద్ద తర్జన భర్జన దీని గురించే జరిగింది! వైస్ ప్రెసిడెంట్ విదేశీ పర్యటనలో వున్నాడు! ఫుట్ బాల్ వుండగా, శస్త్ర చికిత్స చేస్తే, అటూ ఇటూ అయితే, ఆ ఫుట్ బాల్ సంగతేమిటి? ఆయన హాస్పిటల్ లో వుండగా, ఆ ఫుట్ బాల్ ని వైస్ ప్రెసిడెంట్ కి అమర్చ వచ్చా? అవసరం పడితే దాన్ని ఆయన ప్రయోగించదానికి రాజ్యాంగం అనుమతి ఇస్తోందా? ఇలా వందలాది ప్రశ్నలు!
యేదో చేసి, వెంటనే వైస్ ప్రెసిడెంట్ ని వెనక్కి రప్పించి, ఆ పరికరం నియంత్రణని తాత్కాలికంగా ఆయనకి అప్పచెప్పారు! తరవాత, రీగన్ కోలుకొని, మళ్ళీ తన ఫుట్ బాల్ తాను తీసేసుకుని వుంటాదనుకోండి.

మరి మనకి ‘ఫుట్ బాల్’ అనేది వుందా? అది మన అధ్యక్షురాలు వొంటి మీదే వుందా?
లేక మన ప్రధాని దగ్గర వుందా? మన ప్రధాని 18 గంటలకి పైగా అయిదో ఆరో బైపాస్ లు చేయించుకొంటున్నపుడు, అది యేమయ్యింది? కొంపదీసి ప్రణబ్ ముఖర్జీ కి గానీ ఇచ్చారా!

మరి పాకిస్థాన్ మాటేమిటి? వాళ్ళ ప్రెసిడెంట్ దగ్గర వుందా? మహమ్మద్ అజర్ దగ్గర వుందా?

ఒసామా బిన్ లాడెన్ దగ్గర యే దేశానికి సంబంధించినదైనా వుందా?

మన సోకాల్డ్ ప్రింట్/ఎలక్ట్రానిక్/ఇతర మీడియా యేమైనా పరిశోధన చేసి, ప్రజలకి వెల్లడించ గలుగుతుందా?

(అమెరిచాలో రోనాల్డ్ రీగన్ సంఘటన జరిగినప్పుడు విషయం బయట పెట్టినది వాళ్ళ మీడియానే!)

Thursday, January 29

"దేశ భక్తి"

యుద్ధోన్మాదమా?


మన పొరుగు దేశానికి బుద్ధి చెప్పాలనడం యుద్ధోన్మాదమా!

యుద్ధోన్మాదమంటే—1948 లో పాక్ ప్రదర్శించిందీ, 1962 లో చైనా చూపిందీ, తరవాత సంవత్సరాల్లో మళ్ళీ మళ్ళీ పాక్ చెలరేగిందీ—అదీ యుద్ధోన్మాదమంటే!

ఇంకా, వియత్నం మీదా, అఫ్ఘాన్ మీదా, సద్దాం మీదా, అమెరికా వాడు చూపింది!

మరి, మన జనం యెందుకు ఉలిక్కిపడతారు యుద్ధం అనగానే?

మనది శాంతికాముక దేశం కాబట్టి—అని ఓ వెర్రి నవ్వు నవ్వుతాము!

నిజంగానే మనది శాంతికాముక దేశం సరే! మన జాతి యెప్పుడో ఘోర యుద్ధాలు చేసీ, చూసీ, శాంతిని కోరుకుంది. అశోకుడంతటి వాడిని అహింసా పథానికి నడిపించిన కళింగ యుద్ధమే మన దేశంలో జరిగిన ఆఖరి అతిపెద్ద యుద్ధం!

తరవాత మన దేశం లో రాజులూ, చక్రవర్తులూ, సార్వభౌములూ యుద్ధాలు చేసినా, నష్టం వాళ్ళ (అంటే మన) వైపే వుండేది—యెందుకంటే మన సైనికులే తుపాకి గుళ్ళకీ, ఫిరంగి గుళ్ళకీ బలయి పోయేవారు!

అందుకే, అలాంటి మూర్ఖులకి వ్యతిరేకంగా పోరాడాలంటే మామూలు ఆయుధాలు పనికి రావు అని, అహింసనీ, సత్యాగ్రహాన్నీ పరమాయుధాలుగా మలిచి, ప్రజల్లో దేశ భక్తి ని రగిల్చి, అందర్నీ ఒకే తాటి మీదకి తీసుకొచ్చి స్వాతంత్ర్యాన్ని సాధించాడు మన జాతిపిత గాంధీ. అందుకే ఆయన మహాత్ముడయ్యాడు!

ఆ తరంలో అందరికీ, దేశ భక్తి అనేదొకటి అన్నిటికన్నా ముందు వుండేది!

1962 లో మనకి ఆధునిక ఆయుధాలు లేక పోయినా, మన సైన్యం చాలా తక్కువైనా, మన ప్రజల దన్నుతో ధైర్యంగా పోరాడగలింది మన సేన. అప్పట్లో ‘దేశ రక్షణ నిధి’ స్థాపించి, పిలుపు ఇవ్వగానే, దేశ ప్రజలే స్వచ్చందంగా కోట్లాది రూపాయలు ధార పోశారు—నగదుగా, బంగారం గా, వస్తు రూపంలో—యెలా వీలైతే అలాగ!

1965 లో, శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి ‘వారానికొక పూట భోజనం మానేసి, దానికయ్యే ఖర్చుని రక్షణ నిధికి విరాళంగా ఇవ్వండి!’ అని పిలుపు ఇస్తే, దేశ ప్రజలందరూ వీలైనన్ని రోజులు ఒంటిపూట భోజనమే చేసి, పొదుపు చేసిన సొమ్ము విరాళాలిచ్చారు!

మహాత్ముడు ధనవంతులు సంపదకి దేశ ప్రజల తరుఫున ట్రస్టీలుగా వుండండి అంటే, ఆతరం అలాగే వుండేది! టాటాలు మొదలైనవాళ్ళు ఉక్కు కార్మాగారాల్ని స్థాపించినా, జౌళి మిల్లులు పెట్టినా, మన దేశ సంపద పెరగాలి, మనదేశం వర్ధిల్లాలి అనే భావించేవారు!

ధనికుల కుటుంబాల్లో పుట్టినా, జే ఆర్ డీ టాటా కూడా కష్టాలు అనుభవించాడు—వ్యాపారాభివృద్ధికి! ‘పీత కష్టాలు పీతవి’ అన్నట్టు, బిర్లాలు, దాల్మియాలూ, రూయాలూ, వాడియాలూ, అంబానీలూ—ఇలా అందరూ!

యెంత దార్శనికుడు కాకపోతే, వంటనూనెల వ్యాపారం చేసుకునే ‘విప్రో’ అధిపతి ‘కంప్యూటరు’ వ్యాపారం లోకి దిగాడు?
కార్సన్ భాయ్ పటేల్ ఇంటింటికీ తిరిగి, తన ‘నిర్మా’ అమ్ముకొనేవాడట!

(యెక్కడో ఒక ధీరెంద్ర బ్రహ్మచారి—జయంతీ షిప్పింగ్--వుండేవాడనుకోండి) అయినా, ఆ తరం అందరిలో, దేశ భక్తి అనేది ఒకటి వుండేది!

సరే, తరవాతది, మా తరం!

—(ఇంకా వుంది)

Monday, December 29

సామూహిక......Vs జనాభా

వివరణ-2

మగాడు సెక్స్ కోసం పెళ్ళికి ఒప్పుకుంటే, స్త్రీ భద్రతకోసం ఒప్పుకుంటుందంటారు! పెళ్ళి జరగ్గానే, మగాడికి భార్య మీద ఓ ఆధిపత్యం వచ్చేస్తుంది! భార్య ‘వద్దు’ అనడానికి వీల్లేదు! పైగా క్రిందితరగతి వాళ్ళకి వున్న టిక్కెట్ అక్కర్లేని వినోదం అదొక్కటే! అందుకని నిర్బంధంగానైనా అనుభవిస్తుంటాడు. పిల్లల్ని కంటూనే వుంటారు—సెక్స్ లో స్త్రీ సంతృప్తి చెందినా, లేకా పోయినా!

సహజీవనంలో ఈ స్థితి వుండదు! ముందుగా ఇద్దరూ ఒకరిని ఒకరు అన్నివిధాలా బాగా ఇష్టపద్దాక, ముందుగానే సెక్స్ లో కూడా ఇద్దరూ సంతృప్తి చెందుతున్నారని నమ్మకం కలిగాకే సహజీవనానికి అంగీకరించవచ్చు!

ఇలా కాకపోతే, ఒకళ్ళకి ఒకళ్ళు నచ్చిన తరవాత, పూర్తిగా అర్ధం చేసుకునేవరకూ సెక్స్ ప్రసక్తి లేకుండా కూడా సహ జీవనంచెయ్యవచ్చు! పూర్తిగా నమ్మకాలు కుదిరితేనే సెక్స్ కి పరస్పరం అంగీకరించవచ్చు!

సహజంగా, ఇద్దరూ స్వేచ్చగా మాట్లాదుకొని, పిల్లల్ని కనడమా వద్దా నిర్ణయించుకోవచ్చు! వద్దనుకున్నంతకాలం నియంత్రణ పద్ధతులు వుండనే వున్నాయి!

యేడాది తిరగకుండా బిడ్డని యెత్తుకోవాలనే ఒత్తిడి వుండదు! స్త్రీకి ‘వద్దు’ అనడానికి సర్వ హక్కులూ వుంటాయి!
మరి జనాభా పూర్తిగా అదుపులోకి వచ్చెయ్యదూ?

దీన్ని చట్టబద్ధం చేస్తే, ఒడంబడిక వ్రాతలో వుండి రిజిష్టరు అయి వుంటుంది గనక, షరతులు ఉభయుల్లో యెవరు ఉల్లంఘించినా, చట్టబద్ధంగానే విడిపోవచ్చు—విడాకుల తతంగం కొనసా………గకుండా! (పిల్లల విషయం కూడా ఒప్పందంలో వుంటుందికదా!)

పట్టణాల్లోను, నగరాల్లోనూ ఇప్పుదు ఇలాంటివి జరుగుతూనే వున్నాయి—చట్టం లేకుండా, లిఖిత ఒడంబడిక లేకుండా!

ఓ స్త్రీ, ఓ పురుషుడూ ఒక బిడ్డతొ మీ పక్క అపార్టుమెంటు అద్దెకి తీసుకుని, సామానుతో సహా దిగి, మగాడు ఉద్యోగానికో, వ్యాపారానికో వెళ్తూ, బిడ్డ స్కూలుకి వెళ్తు వస్తూ వుంటే, అది ముచ్చటైన కుటుంబం అనుకుంటారా లేక ఆ మగాడు బిడ్డతో సహా వున్న స్త్రీని లేపుకొచ్చాడనుకుంటారా?

అలాంటి సహజీవనాలెన్ని లేవు?

Sunday, December 28

సామూహిక...... Vs జనాభా

వివరణ--1



1) అసలు వివాహం అంటే ఓ లైసెన్స్—చట్టబద్ధంగా, సురక్షితంగా, స్వేచ్చగా, భార్యా భర్తలు లైంగిక సంబంధాన్ని అనుభవించడానికి! దానికోసం మొదటి మూడు నిద్రలూ జరిపించటం ఓ ముచ్చట! ఆ తరవాత కూడా, రాత్రి తొమ్మిది అవగానే, భార్యా భర్తలు పడగ్గదిలోకి వెళ్ళి తలుపులు మూసుకున్నా, ఇంట్లో వాళ్ళు (పుట్టింట్లో గాని, అత్తింట్లో గాని) ముసిముసిగా నవ్వుకుంటారేగానీ, వద్దనరు, తప్పు పట్టరు! (యెక్కడో కొంతమంది అత్తలు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారులెండి!)

ఇంతే కాకుండా, వాళ్ళమీద ఒక అజ్ఞాత ఒత్తిడి వుంటుంది—వెంటనే ఓ బిడ్డని కనాలని.

దీంతోపాటు, ఒక యేడాది తిరిగేసరికల్లా, బిడ్డ పుట్టలేదనుకోండి, ఇంట్లో వాళ్ళూ, వీధిలో వాళ్ళూ, ఇంటికి వచ్చేపోయే బంధువులూ, ఇంటిపనివాళ్ళూ, చివరికి ఆ వీధి ముష్టివాళ్ళు కూడా ఆరా తీస్తారు—‘అమ్మాయి ఇంకా నీళ్ళు పోసుకోలేదా?’ అంటూ!

దీనివల్ల, ఈ రోజు ఓ వెయ్యి సామూహిక వివాహాలు అయ్యాయనుకోండి, (వాళ్ళ సరాసరి వయసు పాతిక వుండచ్చు) 2009 డిసెంబరు 31 లోపల కనీసం 800 నించి 850 శిశువులు పుడతారు! (ఇవి కోట్లాదిగా ప్రతీ యేటా జరిగే మామూలు వివాహాలకి అదనంగా, ప్రభుత్వ/మత ప్రోత్సాహంతో జరుగుతున్నవి అని మరిచి పోకండి).

వాళ్ళలొ, ఓ 5 శాతం దాకా—అంగ వైకల్యంతోనో, మానసిక సమస్యల్తోనో పుట్టడానికి అవకాశం వుంది అని ఆధునిక శాస్త్రం చెబుతోంది!

ఇంకో 10 శాతం దాకా—సరైన ఆహారం లేక, 5 యేళ్ళలోపే మరణిస్తున్నారని కూడా శాస్త్రం చెబుతోంది!

బతికి బట్టకట్టిన వాళ్ళలో, సరైన తిండీ, గుడ్డా లేక, పతితులూ, భ్రష్టులూ, బధా సర్పదష్టులుగా మారుతున్నవాళ్ళూ—ఓ 20 శాతం వుంటారు!

మిగిలిన వాళ్ళలో 50 శాతం—చేతికీ, నోటికీ కష్టం మీద లింకుచేసుకుంటూ బ్రతికే దిగువ మధ్యతరగతికి చెందే అవకాసం వుంది!

ఇక్కడకి మిగిలిన 15 శాతంలో, కొంతమంది ఉద్యోగాల్లోనూ, వ్యాపారాల్లోనూ, ఇతర వృత్తుల్లోనూ చేరి, యెగువ మధ్య తరగతిగా మారతారు!

ఏ 0.5 శాతమో కోటీస్వరులు అయినా అస్చర్యం లేదూ!

ఇవన్నీ సామాజిక సమస్యలు. వీటిని అధిగమించడానికి సహజీవనం యెలా తోడ్పడుతుందో—మళ్ళీ చూద్దాం!

Saturday, December 27

సహజీవనం

ఇవాళ 27-12-2008 ఈనాడులో ‘సహజీవనమూ పెళ్ళే’ అనే శీర్షిక చదివారా?

మహారాష్ట్ర ప్రభుత్వం సహజీవనం చేసేవారు పెళ్ళి తో సమంగా న్యాయసూత్రాలకి బద్ధులై వుండాలని, మార్గ దర్శక సూత్రాలు రూపొందించే పనిలో వుందట!

ఇదో సంగతి!

Friday, December 26

జనాభా

675,16,43,600

రేపు జనవరి ఫస్ట్ కి ప్రపంచ జనాభా చేరుకోబోతున్న అంకెట ఇది!
అది కూడా అభివృద్ధి చెందిన దేశాల్లోనే పెరుగుదల శాతం యెక్కువట! (అచ్చు పొరపాటై వుంటుంది—‘చెందుతున్న’ అని వుండవలసింది.)

మరి మనదేశంలో మనవంతు కృషి?

ఎందుకు చెయ్యడంలేదు—అంటారా?

అదే—తితిదే తరఫున వేలాది సామూహిక వివాహాలూ, వీళ్ళని చూసి ఇతర మతాలవాళ్ళు కూడా సామూహిక వివాహాలకి ప్రొత్సాహకాలు అందించడం—ఇలా శాయ శక్తులా కృషి చేస్తున్నాం!

మొన్నీ మధ్య ఓ బాలీవుడ్ నటీమణి, జనాభా పెరుగుదలని అరికట్టక పోవడం వలననే ‘సునామీలూ’ వగైరా వస్తున్నాయి అందిట! (పాపం తను చదువుకున్న ‘మాల్థూజియన్ థియరీ ఆఫ్ పాప్యులేషన్’ లోని పాజిటివ్ చెక్స్ వగైరా గుర్తొచ్చి ఎదో అని వుంటుంది!—మీడియా దాన్ని సందర్భ రహితంగా వుపయోగించుకొంది!)

జనాభా పెరుగుదల అరికట్టాలంటే, మేధావులు చేస్తున్న ముఖ్య సూచన, ఇష్ట పడిన స్ట్రీ పురుషులు ‘కలిసి వుండడం’ ని చట్టబద్ధం చెయ్యాలని! కొన్ని దేశాల్లో ఇది అమల్లో వుందట!

నిజంగా చాలా మంచి సూచన! సమాజం కూడా బాగుపడుతుంది!

ఓ పాతిక సంవత్సరాల క్రితం, ఉత్తర భారతంలో ‘మైత్రీ కరార్’ అని వ్రాసుకుని, రిజిష్టర్ చేయించుకునేవారు.

అంటే ఓ ఆడా ఓ మగా ‘మేమిద్దరం స్నేహం గా వుండదలుచుకున్నాం’ అని ఒప్పందం వ్రాసుకొని, మిగిలిన షరతులన్నీ పకడ్బందీగా వ్రాసుకునేవారు—‘తోడుకోసం, సామాజిక భద్రతకోసం మాత్రమే, యెవరి సంపాదనా ఖర్చూ వారివే, ఒకవేళ పిల్లలు పుడితే ఏమి, ఎలా చెయ్యాలి—లాంటివన్నీ కూడా వ్రాసుకొని, రిజిష్టరు చేయించుకునేవారు!

అప్పట్లో, ఓ హైకోర్ట్ ఈ కరార్లు చెల్లవు అని తీర్పు ఇచ్చినట్టు గుర్తు.

ఇప్పటికైనా ఇలాంటివి చట్టబద్ధం చేస్తే, సగం సామాజిక సమస్యలు, ప్రేమోన్మాదాలూ, యాసిడ్ దాడులూ లాంటివి తప్పుతాయి!

ఏ పార్టీ అయినా ఇలాంటి వాగ్దానంతో పోటీ చేసే ధైర్యం చేస్తుందా?

Wednesday, December 24

నిజమేనా?

Is it not?


Feroz Khan was a Parsi.

When he wanted to marry Indira Gandhi and she agreed, her father Nehru was reluctant to marry her off to Feroz!

Then our Mahatma Gandhi announced that he would adapt Feroze and lend him the name of Gandhi!

Then he himself has performed the marriage, convincing Mr. Nehru.

Our modern World history starts with the words “When Constantinople yielded to the Turks………..”! Nobody know why it yielded to the Turks!

The ancient Turks (‘Turushkulu’ in Telugu) had divided later into so many Religions, Sub-Religions, Sects and Sub-Sects—like Shias, Sunnis, Jews, Zorastrians, Dawoodi Bohras, Parsis, Bondilis etc.

The only common bond among these is ‘Suntee’ in Telugu, ‘barmitzvah’ for Jews, and ‘Male Organ Circumcission’ in Science & Surgery!

(Please correct me if I am wrong in case of any of these sects.)

So far as ‘kur-An’ is concerned, there is never a reference to the word ‘Muslim’ in the entire Text!

The followers of ‘Islam’ were called ‘Musalmaan’s! The Western People, who could not pronounce the word properly used to pronounce ‘Moslems’ and later it has transformed into the word ‘Muslims’!

In India also, the followers of Prophet Mohammed were called ‘Mohammadans’!

But the irony is, the Indian Media has created a separate Religion/Sect known as ‘Muslim Sodarulu’!

They are neither Mohammadans, Muslims, Islam followers, Turks, Shias, Sunnis, Parsis etc., but a separate entity!

(Please read, in any print media, no single word ‘Muslim’ is printed! Only ‘Muslim Sodarulu’ is found!

Hear any electronic media—no single word ‘Muslim’ is heard! Only ‘Muslim Sodarulu’ is heard!—

What a pinnacle of hipocracy!)

Why don’t we call a Spade a Spade—at least now?

Monday, December 22

టీం సోనియా!

ఉలిపికట్టా…..గూఢచారా?

అనినీతి కుంభకోణాల భీష్ముదు—ఏ ఆర్ ఆంటూలే మహశయుడు నోరు విప్పాడు—అది నోరా, సెప్టిక్ టాంకా అనిపించే విధంగా!

ఊరందరూ (దేశ విదేశాలన్నీ) పాకిస్థాన్ ని వేలెత్తి చూపిస్తుంటే, వీడు ముంబాయిదాడులు ఇంకెవరిపనైనా యేమో—అంటూ!

వీడు మన దేశానికే అవినీతి భీష్ముడు! (బై ది బై, క్రికెట్ టీము లో వీడు మిడిల్ ఆర్డరు!)

జయంతి ధర్మతేజ, ముంద్రాల్లాంటివాళ్ళు లక్షల్లో ప్రారంభించిన కుంభకోణాల్ని, మొదటిసారిగా కోట్లలోకి చేర్చిన రికార్డు హోల్డరు!

మహారాష్ట్ర ముఖ్య మంత్రిగా వుంటూ, “ఇందిరా గాంధీ ప్రతిభా ప్రతిష్ఠాన్” పేరుతొ అధికార దుర్వినియోగానికి పాల్పడి, కోట్లు నొక్కేసినవాడు!

అతి కష్టమ్మీద వీడి ముఖ్య మంత్రి పదవి పీక గలిగింది ఇందిరా గాంధీ! (గవర్నరు పదవి ఇచ్చింది లెండి).

తరవాత, అవినీతి ధృతరాష్ట్రుదు రాజీవ్ గాంధీ యేకంగా 46 కోట్ల “బొఫొర్స్" కుంభకోణంతొ కోట్ల కుంభకోణాలు సామన్యమైపోయాయి ఇండియాలో!

నాలుగో వికెట్ అర్జున్సింగ్ గారు, ‘జోర్హాట్ లాటరీ’ తొ జోర్హాట్ బాబా గా ప్రసిద్ధి చెందారు!

అసలు వీళ్ళందరికీ మన ‘అంధేర్ నగరి’ ‘అన్ భుజ్ రాజా’ కొలువులో వుండడానికి అర్హత యేమిటంటారు? రాజకీయ మహా మఱ్ఱి చెట్టు ఇందిరా గాంధీ పేరు చెప్పుకొని—కాయలుకూడా కాదు—కట్టెలు అమ్ముకోవడం తప్ప?

ఇందిరా గాంధీ ఓ గొప్ప నాయకురాలే! ఆమె సమర్ధతనీ, దేశాభివృద్ధి పట్ల ఆమె నిబద్ధతనీ యెవరూ ప్రశ్నించలేరు—కానీ, వోటు రాజకీయ, వోటు బ్యాంకు రాజకీయాల వల్ల వీళ్ళందర్నీ భరించవలసి వచ్చింది!

ఆ దరిద్రం ఇప్పటి వరకూ దేశాన్ని వదలడంలేదు—ఆవిడ కోడలు పుణ్యమాని! అసలు ఆ చేట పెయ్యని నిలబెట్టింది ఈ వెధవలే కాదూ?

వృద్ధ జంబుకం (మూడో వికెట్--రక్షణ మంత్రి) తాటాకు చప్పుళ్ళు చేస్తోంది—పాకిస్ఠాన్ తోడేలు పై! ‘మేము దేనికీ వెనుకాడం’ లాంటి మాటల్తో! అమెరికా, ఇతర దేశాలూ తెగేసి చెప్తున్నాయి ‘పాకిస్థాన్ తీవ్ర వాదుల మీద చర్య తీసుకోకుంటే సహించేది లేదు!’ అని. ఈ మద్దతు తో ఇప్పటికే పీవోకే లోని టెర్రరిస్ట్ స్థావరాలని ఓ చూపు చూడవలసింది!

కానీ, దళాలని నడిపించ గలిగిన ‘మానెక్ షా’లేరీ? ఓకే అనగలిగిన ఇందిరా గాంధీలేరీ?

ఈ క్రికెట్ టీముల్ని హిందూ మహా సముద్రం లో కలపగలిగిన వొటరులేరీ?

వున్నారంటారా! సరే! చుద్దాం!

Sunday, December 14

మీడియా

మీడియా

వార్తా పత్రికలూ (ప్రింట్ మీడియా), టీవీలూ, కంప్యూటర్లూ వగైరా (ఎలక్ట్రానిక్ మీడియా), రేడియోలూ ఫోన్లూ, (ఇదేమి మీడియానో తెలీదు) ఇలాంటివన్నీ “మీడియా” అంటున్నారు.

ప్రజాస్వామ్య దేశం లో ఇది చాలా శక్తివంతమైనదట!

మరి అలాంటి మీడియా యెంత బాధ్యతాయుతంగా వుండాలీ?

పేపర్లలో మొన్న ముంబాయిలో తీవ్రవాదుల దాడి సందర్భంగా ఇండియా గేట్ దగ్గర మోహరించిన కెమేరాలూ వగైరా ని తీసి ప్రచురించిన ఫోటోలు చూశారుగా?

ఇప్పుడు దర్యాప్తు సంస్థలు తేల్చినదేమిటంటే, ఈ లైవ్ టెలీకాస్టుల వల్ల ఉగ్రవాదుల నాయకులకి యెప్పటికప్పుడు తాజా స్థితి తెలెసిపోయేది అనీ, వాళ్ళు మళ్ళీ ముంబాయిలో తీవ్రవాదులకి తాజా ఆదేశాలు జారీ చేసేవారనీ!

అదే కాదు—ఓ పక్క ఒక సంఘటన జరిగితే, దర్యాప్తు సంస్థల కన్నా ముందు ఆ స్థలాన్ని చేరుకొని, అంతా కంగాళీ చేసేసి, అధారాలని దొరక్కుండా చేస్తున్నవి ఈ మీడియాలే!

అదే అమెరికా లాంటి దేశాల్లో, నిరంతర పెట్రోలింగ్ వగైరాల వల్ల, సంఘటన జరిగిన రెండు మూడు నిమిషాల్లోనే, పోలీసులు అక్కడికి చేరి, సంఘటన స్థలం చుట్టూ పసుపు రంగు రిబ్బన్లు కట్టేసి, ఇంకెవర్నీ ఆ స్థలంలోకి రానివ్వరు! మీడియా వాళ్ళని కూడా! వాళ్ళు అవసరమైన ఆధారాల్ని సేకరించాక, అప్పుడు మీడియాని అనుమతిస్తారు! అప్పుడు నేరగాళ్ళని పట్టుకునే అవకాశాలు చక్కగా వుంటాయి.

ఇంక ప్రింటు మీడియాలో కూడా, కొంతమంది సోకాల్డ్ ‘ఎక్స్పర్ట్’ కాలమిస్టులు తమ అభిప్రాయాలని విచ్చలవిడిగా వెదజల్లుతూ వుంటారు! ఉదాహరణకి, ఓ కాలమిస్ట్ “గత కొన్ని రోజులగా వడ్డీ భారాలతో నడ్డి విరుగుతున్న ‘సామాన్యుడు’ రిజర్వ్ బ్యాంక్ తీసుకున్న చర్యలతో కాస్త ఊపిరి పీల్చుకుంటున్నాడు” అంటాడు!

సంక్షోభం అంటూ చెప్పుకుంటున్న స్థితి మొదలయ్యాక, ఇప్పటివరకూ అలా ‘నడ్డి విరిగిన’ ఒక్క సామాన్యుణ్ణయినా చూపించ గలడా, ఆ కాలమిస్ట్?

ఇంకొకడున్నాడు—వాడు ఎమర్జన్సీ టైములో గవర్నమెంటుని నిర్భయంగా కలంతో యేకేశాడు. తరవాతకూడా ఇందిరాగాంధీ చేస్తున్న తప్పులనీ, ఏ ఆర్ ఆంటులే, అర్జున్ సింగ్ లాంటి అవినీతి పరుల్ని యేకేశేవాడు. తరవాత, జనతా ప్రభుత్వాన్ని—అసలు సమస్యేకాని ‘ద్వంద్వ సభ్యత్వం’ లాంటి కారణాలతో, పడిపోయేదాకా వదల్లేదు! రాజీవ్ టైములో ‘బోఫోర్స్ ‘ నీ, వీపీ సింగ్ టైములో సెయింట్ కిట్స్ కేసునీ, ఇలా యేదీ వదిలేవాడు కాదు. వాజపేయి గారి టైములో, ‘కాషాయీకరణ’ అనేవాడు. మరిచిపోయాను—పాకిస్థాన్ మీద ఎక్స్పర్ట్! పదిరోజులకోసారైనా అక్కడికి వెళ్ళి వస్తూ వుంటాడు. పాకిస్తాన్ ని కౌగిలించుకోవాలంటాడు. కాశ్మీరు మండిపోయినా, ముంబాయి పేలి పోయినా, పార్లమెంటు దద్దరిల్లినా—పాకిస్థాన్ తో స్నేహ సంబంధాలకి భారత్ మాత్రమే ముందడుగు వేస్తూ వుండాలంటాడు!

ఇలాంటి మీడియాల వల్ల ప్రజాస్వామ్యానికి యేమి ఒరుగుతోందో యెవరికి వారే అలోచించాలిమరి!

Wednesday, November 26

మహిళాలక్షాధికారులు!


మన ముఖ్యమంత్రి గారికి ఉట్టికెక్కలేక పోయినా, స్వర్గానికి యెక్కాలని ఆశ!
(మోటు సామెత చెపితే, ‘పిత్తడానికి శక్తి లేదు గానీ, పాసనాలకి మందు అడిగాడట!)’

‘లక్ష కోట్ల బడ్జెట్’ ‘ముష్టెత్తైనా జలయఙ్ఞం సాగిస్తాం’ ‘భూములమ్మి, నిధులు సంపాదిస్తాం’ లంటి మాటలతో ప్రారంభించిన ఇన్నింగ్స్, ఫాలో ఆన్ తో ముగించాల్సిన పరిస్తితి వొచ్చేట్టుంది!

అసలే ప్రతిపక్షాలూ, పత్రికలూ, కోర్టులూ, ట్రిబ్యునళ్ళూ, ‘కాగ్’, రైతులూ, సెజ్ బాధితులూ, కారిడార్ బాధితులూ తో పాటు సామాన్యులు కూడా (గుత్తేదార్లూ, సెజ్ ల లబ్ధిదార్లూ తప్ప) చీల్చి చెండాడుతున్నారు!

పులి మీది పుట్రలా ఆర్ధిక మాంద్యం—రియల్ ఎస్టేట్ వ్యాపారం పడుకోవడంతో, ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి!

అయినా, మేకపొతు గాంభీర్యం ప్రదర్సిస్తూ—‘చేబదుళ్ళకి వెళ్ళం’ అంటున్న ఆర్ధిక మంత్రి, నకనకలాడుతూ డిపార్టుమెంటులు వుండగా, మన ముఖ్య మంత్రి మాత్రం “కోటి మంది మహిళల్ని లక్షాధికారుల్ని చేస్తాం—పావలా వడ్డీతో!” అంటూ ప్రకటనలు!

యెవరి చెవుల్లో పువ్వులు పెడతారు?

(మహిళా గ్రూపుల గురించి మరోసారి!)

Tuesday, November 25

ద్రవ్యోల్బణం

ముడి చముఱు ధర పీపా 50 డాలర్ల లోపుకి పడిపోయింది(ట)!

అమెరికా లో లీటరు 4 డాలర్లకి పెరిగిన గాసోలిన్ ఇప్పుడు మళ్ళీ 1 డాలరుకి తగ్గిందట.

మనకి మాత్రం పెరిగినప్పుడు పెరగడమేగాని, తగ్గినప్పుడు తగ్గడం వుండదు!

దగ్గర దగ్గర 150 డాలర్లనించి తగ్గింది కదా? మరి మన విత్త/ఇంధన మంత్రులు యేమంటున్నారు?

‘చముఱు కంపెనీల పేరుకున్న నష్టాలు తగ్గుతున్నాయ'ట—అందుకని 'ఇప్పుడప్పుడే తగ్గించరట!’

ఇదివరకు ఎన్ డీయే గవర్నమెంట్ చముఱు ధరలు పెరగడం మొదలవగానే, ఓ వందో యెన్నో కోట్లతో ‘ఆయిల్ పూల్ ‘ యేర్పాటు చేసి, దాని నుంచి పెరుగుదలనీ, తగ్గుదలనీ సర్దుబాటు చేసేది.

ధరలు స్థిరపడగానే, ఆ పూల్ ని రద్దు చేసింది. అక్కడనించీ, మార్కెట్ మీద ఆధారపడి, లీటరుకి రెండు పైసలో, ఐదు పైసలో పెరగడమో తగ్గడమో జరిగేది!

మరి ఈ గవర్నమెంట్ పీపా యే డెబ్భై డాలర్లకో గబ గబా పెరగ్గానే ఆ పని చేసి వుంటే, ద్రవ్యోల్బణం ఈ రోజు ఈ స్తితికి వచ్చేది కాదుగా?

వీళ్ళకి ‘సామాన్యుడంటే’ లెఖ్ఖ వుంటేగా?

Tuesday, November 4

బలుపుకాదు.....వాపు!

అమెరికాకి కాబోయే అధ్యక్షుడు బరాక్ ఒబామా బుష్పరిపాలనపై, రిపబ్లికన్ పార్టీ పై సారించిన ముఖ్యమైన ఆరోపణాస్త్రం యేమిటి?

“షేర్ మార్కెట్ కి అలవిమాలిన ప్రాముఖ్యం కట్టబెట్టి, తక్కిన రంగాల్నినిర్లక్ష్యం చేసిన అవకతవక విధానాల పర్యవసానంగానే ‘మహామాంద్యం’ పునరావృతమయ్యే దుస్థితి దాపురించింది” అని!

ఆయనంటున్న ‘మహా మాంద్యం’ 1929 నాటి ప్రపంచ (అంటే అప్పట్లో యూరప్, అమెరికా ఖండాలు) ‘గ్రేట్ డిప్రెషన్’ అనబడే ఆర్ధిక మాంద్యం!

దీని గురించి ఓ చిన్న జోక్ లాంటి నిజం—

తండ్రి చనిపోయాక, కొడుకులిద్దరు సమానంగా ఆస్థి పంచుకున్నారట. తరవాత అన్నగారు చాలా జాగ్రత్తగా తన డబ్బుని పెట్టుబడులుగా పెట్టాడట.

తమ్ముడు మాత్రం, డబ్బంతా తగలేసి, కొన్నివేల సీసాలు మద్యం తాగుతూ గడిపాడట!

ఈ లోగా రానే వచ్చింది ‘గ్రేట్ డిప్రెషన్’!

దాంతొ అన్నగారు ఒక్కసారిగా బికారి అయిపోయాడు!

మాంద్యం పోగానే, తమ్ముడు, ఖాళీ మద్యం సీసాలు అమ్ముకొని, కోటీశ్వరుడు అయ్యాడు!
అదండీ సంగతి!

మన విత్త మంత్రి గారేమో ‘వ్హిప్పింగ్ ది డెడ్ హార్స్’!

ఈ రోజు (04-11-2008) బ్యాంకర్లని ఋణాలమీద వడ్డీ రేట్లు తగ్గించాలని కోరి, అందుకు వప్పించాడట!

ఈ రొజున కూడా వయో వృద్ధులకి 11%, మిగిలినవాళ్ళకి 10.50% వడ్డీతో డిపాజిట్లు సేకరిస్తున్నాయి బ్యాంకులన్నీ! ఈ నెలాఖరు వరకూ బహుశా ఇదే కొనసాగుతుంది!

మరి ఋణాల వడ్డీలు ఎలా తగ్గుతాయి? బహుశా కోటి రూపాయల పైబడిన ఋణాలకి ఓ 0.5% తగ్గిస్తారేమో!

బై ది బై, మీ రిజర్వ్ బ్యాంకు ఆర్ధిక వ్యవస్థ లోకి విడుదల చేసిన 2,50,000 కోట్లేమయ్యాయి?

సెన్సెక్స్ ని అతి కష్టం మీద 10,000 పాయింట్లు దాటించాయి!

ఇప్పటికైనా ఒప్పుకుంటారా—ఇది బలుపు కాదు…..వాపు అని?

Sunday, November 2

మా మేష్టారి ఇంకో తిట్టు

‘యెదవన్నర యెదవన్నర యెదవాని!’

అని తిట్టి, అడిగేవారు—‘అంటే యెన్ని యెదవలురా?’ అని!

వెంటనే లెఖ్ఖల్లో బ్రైట్ కుర్రాదు లేచి, ‘4 యెదవలు మేష్టారూ’

అంటే, ‘ఒరే! యెదవా! యెదవన్నూ, అరయెదవన్నూ, అరయెదవన్నూ కలిపితే యెంతరా?’అని లెఖ్ఖల్లో పూర్ కుర్రాణ్ణి అడిగి, వాడు ‘రెండు యెదవలు సార్’ అనగానే, అద్గదీ! అనేవారు!

మళ్ళీ ‘ఈసారి వీసెన్నర వీసెన్నర వీసె అంటే, ఎన్ని వీసెలురా?’ అని అడగ్గానే, నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అనుకొంటూ, యెప్పుడూ మేష్టారు నిన్నే మెచ్చుకునేలా వుండాలని తల్లిదండ్రుల చేత ప్రబోధింపబడినవాడైన లెఖ్ఖల్లో బ్రైట్ కుర్రాడు, అంతకు ముందు అయిన అవమానాన్ని మరిచి పోయి, ‘రెండు వీసెలు మేష్టారూ’ అనగానే,
మళ్ళీ మేష్టారు ‘వీశెన్నరా, వీశెన్నరా, వీశా—ఎంతరా? అని అడిగి, పిల్లలు కోరస్ లో ‘నాలుగు వీశెలు సార్’ అంటుండగానే, చిన్నబుచ్చుకుంటున్న లెఖ్ఖల బ్రైట్ కుర్రాణ్ణి చూస్తూ—‘ఒరే! ట్రిక్ తెలిసిందా? లెఖ్ఖలంటే ఇలా కూడా వుంటయి! పుస్తకాల్లో చెప్పేవేకాదు!’ అని కొసమెరుపు ఇచ్చేవారు!

అన్నట్టు ఈ వీశెల మానం పూర్తిగా చెప్పనా?

2 అర తులములు = 1 తులము
2 తులములు = 1 ఫలము
2 ఫలములు = ½ పంపు
2 ½ పంపులు = 1 పంపు
2 పంపులు = 1 ఏబులము
2 ఏబులములు = 1 పదలము (లేదా) ½ వీశ
2 ½ వీశలు = 1 వీశ
8 వీశలు = 1 మణుగు
20 మణుగులు = 1 పుట్టి (లేదా) బారువ

—ఇవి తూకానికి సంబంధించినవి!

ఇవి కాకుండా, కొలతలకి (పాత్రల్లో కొలిచేవాటికి) ఇంకో మానం వుండెది.
దానికీ, దీనికీ సంబంధం వుండెది!

అవి మరోసారి!

మరి ఇంతకీ ఆ లెఖ్ఖల్లో బ్రైట్ కుర్రాడెవరో ఊహించండి!

Saturday, November 1

పిల్ల కాకి


1975వ సంవత్సరం, ఆ తరవాతా, దేశంలో యమర్జెన్సీ అమల్లో వుండగా, మాలో ఓ జోక్ బయలుదేరింది.

ఆ సమయంలో, ఇతర పార్టీల నాయకులందర్నీ కటకటాల వెనక్కి తోసేశారు! పత్రికలమీద సెన్సార్ షిప్ విధించబడింది! దానికి నిరసనగా, పత్రికలు తమ సంపాదకీయాల్తో సహా, సెన్సారు చేయబడ్డ మేటర్ స్థానంలో యేమీ ముద్రించకుండా, తెల్లగా వదిలేసేవి! అది చూసి, మరో ప్రభుత్వ ఉత్తర్వు—పత్రికల్లో యెక్కడా ఖాళీలు వుంచకుండా తప్పనిసరిగా అచ్చుతో నింపాలని!

అలా వుండేది!

అప్పటి కాంగీ—ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (ఐ—అంటే ఇందిర!) నినాదం

“దేశ్ కీ నేతా—ఇందిరా గాంధీ!
యువాఓంకా నేతా—సంజయ్ గాంధీ!” అని వుండేది.

అప్పట్లోనే, రాజీవ్ గాంధీ కి కొడుకు పుట్టేడు.

అప్పుడు మేము పుట్టించాం—‘బచ్చోం కే నేతా—రాహుల్ గాంధీ’ అని కూడా కలుపుతారు! ఆని.

ఆ బచ్చా, ఈ రోజు యువా అవనే అయ్యాడు!

అప్పట్లో సంజయ్ వెనకాల, వయో వృద్ధ నాయకులు కూడా, వాడి చెప్పులు మోస్తూ తిరిగారు!

తరవాత, రాజీవ్ వృద్ధ నాయకుల్ని గెంటేసి, పార్టీని వశం చేసుకున్నాడు—ఇదంతా చరిత్ర.

ఇప్పుడీ యువ (పిల్లకాకి) పేలుతున్నాడు!

మావంశంలోవాళ్ళు అధికారంలో వుంటే బాబ్రీ మసీదు కూలేదేకాదు……వగైరా వగైరా! (వీళ్ళ వంశం నిర్వాకాలు యెవరికీ తెలియవనుకుంటున్నాడు…..పాపం)

సరే, అవన్నీ అటుంచండి. మొన్న టీవీ వార్తల క్లిప్పింగుల్లో ‘మా నాన్న హత్య జరిగి ఇన్నేళ్ళయినా—నాకింకా న్యాయం జరగలేదు’ అని బుక్కు బుక్కుమంటూంటె, ఆహా, తన వంశంవారి ఆధ్వర్యంలో నడుస్తున్న పాలనని విమర్శించేంత దమ్ము వచ్చిందా అని ఆశ్చర్య పోయారు జనం!

తరవాత తెలిసింది—సందర్భమూ, అసలు విమర్శా యేమిటని!

యెవరో ఓ విద్యార్థి ‘అఫ్జల్ గురుని గవర్నమెంటు ఇంకా యెందుకు ఉరి తియ్యలేదు?’ అని అడిగినందుకట ఈ కోపం! యెవరి మీద అని ఆయనే వివరణ ఇచ్చాడు---మన న్యాయ వ్యవస్థ చాలా నెమ్మది---కాబట్టే నాకింకా న్యాయం జరగలేదు---అని.

అవాకులూ, చెవాకులూ కాకపొతే యేమిటి?

అఫ్జల్ గురు విషయంలో న్యాయ వ్యవస్థ చెయ్యవలసినది చేసి (ఉరి శిక్ష వేసి) యేళ్ళు గడుస్తున్నాయనీ, అమలు పరచనిది ఈ చేతగాని ప్రభుత్వమేననీ, దానికి వేరే కారణాలు కూడా వున్నాయని మరిచిపోయాడా?

మీ నాన్న విషయంలో నువ్వు నిరీక్షిస్తున్న న్యాయం యేమిటి?

నీయక్క జైలుకి వెళ్ళి మరీ నళినిని పరామర్శించి, తిరిగొచ్చాక ‘ఆడ కూతురు—చంటిపిల్లతో వుంది—విడుదల చేసెయ్యచ్చుకదా’ అని వాపోయిందే? థాను కూడా ఈ రొజు బ్రతికే వుండి, నళిని వున్న స్థితిలోనే వున్నా, ఇదే మాట అనగలిగేదా?

నీ అక్కది వేరే న్యాయం, నీది వేరే న్యాయమా?—అని యెవరైనా అడిగారా?

యెందుకైనా మంచిది—ఏ ఫారిన్ నిపుణుడిచేతో వీడికి కౌన్సెలింగ్ చేయిస్తే మంచిదేమో ఆలోచించండి!

లేకపోతే—‘ప్రధాని కావడానికి అన్ని లక్షణాలూ వున్నాయి’ అనే ముసలీ, ముతకా, మధ్య వయస్సు నాయకులూ, నాయకురాళ్ళ పుణ్యమా అని వీడు ప్రధాని అయితే (పాపము శమించుగాక)—మనలాంటి వాళ్ళ గతి—మహమ్మద్ బిన్ తుగ్లక్ పాలనలో ఢిల్లీ నించి దేవగిరికీ, దేవగిరి నించి ఢిల్లీ కి ప్రయాణాలు చేస్తూ, లక్షల్లో చచ్చిన వాళ్ళలా—పడుతుందేమో!

Thursday, October 30

చిన్న మాట.....


నా బ్లాగ్ చదివేవాళ్ళు కొంతమంది నేను ద్రవ్యోల్బణానికి, కాంగీరేసు గవర్నమెంట్ కీ లింకు పెడితే, ఇంకేదో అన్నారు!

ఒక సంగతి మరచి పోకండి! యూఎస్ బ్యాంకులు దివాలా తీయడానికి చాలా ముందే మన ద్రవ్యోల్బణం రెండంకెలని చేరుకుంది!

శ్రీ వై.వి.రెడ్డిగారు యేమీ చెయ్యనివ్వలేదని బాధపడ్డారు!(ట)

శ్రీ దువ్వూరివారు మొట్టమొదట తీసుకోవలసిన చర్యగా బ్యాంకుల సీఆరార్ పెంచుతే, మర్నాడే ఆయనచేత ఆయన పెంచిన 0.5 శాతమే కాకుండా ఇంకో 1 శాతం తగ్గించేలా చేశారు మన విత్త మంత్రి!

అదీ నేను వ్రాసింది! కాదంటారా?

ఇంక సబ్ ప్రైం గురించి నేను వాడిన "రీజనబుల్ అమౌంట్ (ఇన్ దెయిర్ వ్యూ)" అనే మాటల్ని 'దయా ధర్మంగా' అన్వయించుకున్నారు కొందరు!

ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకులు చెల్లించిన మొత్తాలు, వారి దృష్టిలొ 'రీజనబుల్ ' అని నా వుద్దేశ్యం! అది ఏ విధంగానూ వాటి అసలు విలువకి చాలా తక్కువేనని, దీంతో అవి డబ్బుచేసుకోవాలనే ఆ పని చేశాయని అర్థం! గమనించండి.

Tuesday, October 28

జబ్తక్ రహేగా లాలూ.......

(ఇండియాకి మోక్షం లేదు)

నిన్న (27.10.2008) న్యూస్ క్లిప్పింగ్స్ లో రెచ్చిపోతున్న బీహార్ రైల్వేల మంత్రి లాలూ ప్రసాద్ ని చూశారా?

బీహారీ కుర్రాడు ‘బెస్ట్ ‘ బస్ లో తుపాకి తో వీరంగం వెయ్యడాన్ని ఖండించకపోగా, మహారాష్ట్ర గవర్నమెంటు మీద నిప్పులు చెరుగుతున్నాడు!

నిజానికి శ్రీ రాజ్ ఠాక్రే కొంచెం ఓవరాక్షన్ చేస్తున్నాడు గాని, అసలు నిప్పు లేకుండా పొగ రాదు కదా?
రైల్వే రిక్రూట్మెంట్ పరీక్షలు జరుగుతున్న నగరాలకి బీహార్ నించి ప్రత్యేక రైళ్ళలో యువతని తరలించి మరీ పరీక్షలు రాయించి, వాళ్ళకే రైల్వే ఉద్యోగాలు కట్టబెడుతున్న సంగతి బహిరంగ రహస్యమేకదా!

అన్నట్టు, లాలూగారు రైల్వేలని లాభాల బాట పట్టించిన ‘మేనేజ్మెంట్ గురు ‘ ట!

అసలు రైల్వేలకి నష్టాలెప్పుడొచ్చాయట?

రైళ్ళలొ రిజర్వేషన్ సౌకర్యాలు పెరగడంతో, టిక్కెట్ కొని ప్రయాణించే వాళ్ళ సంఖ్య బాగా పెరిగింది. ఓ ముప్ఫై నించి ఇరవై యేళ్ళ క్రితం, ఇటు వైజాగ్ దాటాక, అటు జబల్పూరు, బలార్షా, అటు నాగపురు ఏ వైపైనా టిక్కెట్లు కొనే వాళ్ళని పిచ్చివాళ్ళ క్రింద చూసేవాళ్ళు—టీటీఈలు. టిక్కెట్ లేనివాళ్ళని ఓ ఐదు రూపాయలు తీసుకొని, (అప్పట్లో 500/- క్రింద లెఖ్ఖ!) వాళ్ళు దిగే స్టేషన్లో గేటు దాకా సాగనంపి, అక్కడ టీటీఈకి (నాకేసు అని) సైగ చేసి, వాళ్ళు భద్రంగా గేటు దాటాకే మళ్ళీ రైలెక్కేవారు!
మరి లాభాలు రావూ?

ఇంకా డీజెల్ బదులు చవగ్గా విద్యుత్ తో నడుస్తున్నాయి రైళ్ళు. చెక్క స్లీపర్ల స్థానం లో హెచ్చు మన్నికగల సిమెంటు స్లీపర్లు వచ్చాయి. కంప్యూటర్లవల్ల కమ్యూనికేషన్లు బాగా వృద్ధి చెంది, సమయపాలన బాగా పెరిగింది. ఇన్ని, ఇంకాకొన్ని కారణాల వల్ల లాభాలు ఎక్కువ వస్తుంటే, లాలూ చేసిందేమిటట?

అయినా, మీడియావాళ్ళు ఈ ‘గురు’ల్ని అనవసరంగా సృష్టిస్తున్నారు! ‘ఫేషన్ గురు’, 'మార్కెటింగ్ గురు’, 'మేనేజ్ మెంట్ గురు’, ఇలాంటివే కాకుందా, ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురు’ట.

మహాకవి శ్రీ శ్రీ గురించి వెబ్ లో వెతికితే, లక్షా తొంభైఆరు సైట్లు ఈ ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురు పేరుతోనే వున్నాయి! యేమైనా, ఈ గురుకి ఆర్ట్ ఆఫ్ లివింగ్ బాగా తెలుసు అని ఒప్పుకోవాలి!

Monday, October 27

నా ఇంకో బ్లాగ్ "ఎ సిటిజన్ అఫ్ ది వర్ల్డ్" లో వచ్చిన ఓ కామెంట్ కి నా సమాధానం ఇక్కడ ప్రచురిస్తున్నాను. చదవండి!

(Copied straight from the blog)

chaitanya said...
Hi... ur interest in banking may have driven you to write such an interesting article on it...now can you explain me the recent crisis in financial market following the lehman break down.... may be da reason is not just subprime mortgages!!
September 22, 2008 10:46 PM

Krishna Sree said...
dear Chaitu!Thank u for ur comment.The prime reason is Sub-Prime Lending itself!Because--what is done in sub-prime lending is--the monies, distributed (lent) by the Banks, through retail lending, could not be recovered by them! So, the investment Banks stepped in and took over the retail loans from the Banks by paying them reasonable (in their view) amounts to the Banks. So, the Banks are safe--but the investment Banks could not realise the mortgages, specifically in case of House mortgage loans due to lack of buyers! Hence the crisis.Added to this, the investment Bankers have invested in futures/derivatives trading carelessly. When the Oil prices began to sky rocket, there is a crisis! So, such trading is a bane to the economy of any country. Who dares to ban such trading?In India also, as I understand, some Banks like ICICI Bank are resorting to sub-prime lending in another way--i.e. lending through other agencies. They are lending large monies to private agencies who in turn are distributing the money through lending to the needy, retailly. Thats why they are in the news!
October 7, 2008 9:23 PM

ఈనాడు పత్రికలో ఇవాళ (27.10.2008) బిజినెస్ పేజీ లో శ్రీ కాట్రగడ్డ కృష్ణ ప్రసాద్ అనే నిపుణుడు 'తెలివైన మదుపరి ఏం చేయాలంటే' అనే శీర్షిక క్రింద ఇచ్చిన ఇంటర్వ్యూ చదవండి!
సబ్ ప్రైం గురించీ, సీడీవోల గురించీ చక్కగా చెప్పారు!
ఇంకా చదవకపోతే, పూర్తిగా చదవండి!
'విదేశీ మదుపరులు...........నిధులను తీసుకు వెళ్ళిపోయినప్పుడు సిసలైన మార్కెట్ ప్రాణం పోసుకొంటుంది.' అన్న సమాధానం గమనించండి! (అంటే వాపు తగ్గుతుందనేగా?)
మొన్న శుక్రవారం సెన్సెక్స్ పడిపోగానే, నాకు తెలిసిన ఓ ఇన్సూరెన్స్ కంపెనీ బ్రాంచి మేనేజరు, మామూలు మాటల్లో, 'బాగా తగ్గాయి కదా షేర్లు, ఇప్పుడేవి కొంటే మంచిదంటారు?' అనడిగారు!
నా సమాధానం ఊహించగలరా? 'ఇప్పటివరకూ అందరూ చేతులే కాల్చుకున్నారు! ఇప్పుడు మార్కెట్లో దిగితే, ఒళ్ళూ ఇల్లూ కూడా కాల్చుకుంటారు! అప్పుడే దానిజోలికి వెళ్ళకండి!' అని.
తప్పంటారా? చూద్దాం!

Sunday, October 26

ద్రవ్యోల్బణం

స్థూలంగా చెప్పాలంటే, ద్రవ్యోల్బణం వ్యవస్థలో డబ్బు చలామణి ఎక్కువయితే వస్తుంది.

ఉదాహరణకి---ప్రజల ఆదాయాలు బాగా పెరగడం, లేదా ఖర్చులు తగ్గడం, బ్యాంకులు, ఇతర ఆర్ధిక సంస్థలు సరళంగా అప్పులివ్వడం, రిజర్వు బ్యాంకు / ప్రభుత్వం ఎక్కువ నోట్లని ప్రింటుచేయడం----ఇలాంటివి!

మరి మొదటిది ఎప్పుడు సాధ్యం?

1. రైతుకి గిట్టుబాటు ధర దొరుకుతోంది.
2. ఉద్యోగులకి జీతాలు బాగా ముడుతున్నాయి.
3. వర్తకులకి బాగా లాభాలు వస్తున్నాయి.
4. అందరూ కడుపు నిండా తినగా, ఇంకా ఎంతో కొంత డబ్బు మిగలడం.
5. ఫ్రజలందరూ ఏదో ఒక ఉపాధి ద్వారా సంపాదించగలగడం.

ఇంకా ఇలాంటివే---మీకు తోచేవి.

ధరలు తగ్గడం అంటే, ‘ద్రవ్య అనుల్బణం’ (ద్రవ్యోల్బణానికి వ్యతిరేకం)! అంటే, ఓపెన్ మార్కెట్ లో కిలో బియ్యం రూపాయకి దొరకడం లాంటివి!

మరి పైన అనుకొన్న పరిస్థితులేమున్నాయని ద్రవ్యోల్బణం విజృంభిస్తోంది?

"కష్టపడి (లేదా ఇంకేదో చేసి) కొంత డబ్బంటూ సంపాదిస్తే, తరవాత అదే పిల్లల్ని పెడుతుంది" అనే సిద్ధాంతం బాగా ప్రాచుర్యం పొందడంవల్ల!

అంటే, దేశంలో సంపదంతా ఓ 10 శాతం మంది చేతుల్లోనే వుంది అంటారు. పోనీ, నేను ఓ 20 శాతం మంది అంటాను.

సరే, మరో 30 శాతం మంది ఎగువ మధ్య తరగతికి చెందుతారనుకుందాం. వీరిలో, గత 30 యేళ్ళుగా ఉద్యోగ, వృత్తి, వ్యాపారాల్లొ ఎంతొ కొంత వెనకేసుకుని, తమ తరం, తమ పిల్లల తరం సౌకర్యంగా జీవించడానికి ఢోకా లేదు అని నిశ్చింతగా ఉండేవాళ్ళు.

ఇంకో 20 శాతం మంది దిగువ మధ్య తరగతికి చెందుతారు! వీరిలో, చిన్న ఉద్యోగులు, చిన్న రైతులు, కౌలుదార్లు, ఇతర వృత్తులవాళ్ళు, (ఖర్చుకి సరిపడా అదాయం దాదాపు సంపాదించగలిగినవాళ్ళు--నెలాఖర్లో అప్పులు చేసైనా)

ఈ రెండు మధ్యతరగతుల్నే బూర్జువాలు, పెటీ బూర్జువాలు అంటారు కమ్యూనిష్టులు.

ఇక మరో 20-25 శాతం ఱెక్కడితేగాని డొక్కాడని వాళ్ళు. దినసరి కూలీలు, రైతు కూలీలు, చేతి వృత్తుల పనివాళ్ళు, హాకర్లు మొదలైనవాళ్ళు.

మిగిలిన 5-10 శాతం 'పతితులూ, భ్రష్టులూ, బధాసర్పదష్టులూ!' వీరు జనాభా లెక్కల్లో వున్నారన్న సంగతి వాళ్ళతోపాటు అందరూ మరచిపోతూ వుంటారు--ఎలక్షన్లకి కొంతకాలం ముందు వీళ్ళని గుర్తు చేసుకొని మొక్కేవాళ్ళు తప్ప!

పై అన్ని వర్గాల్లోనూ, 50 శాతం స్త్రీలు! ఈమాట మాత్రం మరువకండి!

ద్రవ్యోల్బణంలోకి తరవాత ప్రవేశిద్దాం!
సూచన

భారతీయ బ్యాంకుల పరిస్థితి గురించి ఈనాడు పత్రికలో సంపాదకీయం ప్రక్కన డా.(శ్రీ) పి.ఎస్.ఎం. రావు గారు ఇవాళ (16.10.2008) చక్కగా వ్రాశారు.

చాలామంది చదివే వుంటారు. ఇంకా చదవకపోతే చదవండి!

Friday, October 24

"8701"---ఇంకో 702 చాలు!

చెప్పానా, సంతొషించే వాళ్ళలో మొదటివాడిని నేను అని! (సెన్సెక్స్ పడిపోతే). ఇవాళ్టి ఫిగరు 8701!
ఏదో పద్యం చెప్పావే------అంటున్నారా! వస్తున్నానక్కడకే!
ఓ పీనాసి, తన దగ్గరున్న బంగారాన్నంతా పద్యంలో చెప్పినట్టు ఓ గోతిలో పాతిపెట్టి, రోజుకోసారి వచ్చి చూసుకుంటుండేవాడట! తరవాత విషయం అందరికీ తెలుసు కదా?
కానీ ఈ కేసులో, బంగారం పిల్లల్ని పెట్టదు కదా?

ఇప్పుడు మోడర్న్ పీనాసులు--వాళ్ళ దగ్గరున్న కొద్దో గొప్పో డబ్బుని (కొంతమంది అప్పులు చేసి కూడా!) షేర్లలో పెట్టి, రోజూ సెన్సెక్స్ చూసుకొని, నా 'ఆస్తి ' ఇంత పెరిగింది....అంత పెరిగింది....అని ఆనందిస్తూ వుంటారు!

బిల్ గేట్స్, వారెన్ బఫెట్ లాంటి వాళ్ళు తమ చెమటోడ్చి సంపాదించిన కాస్తో కూస్తొ డబ్బుతో ఓ కంపెనీ స్థాపించి, అది ఇంతింతై, వటుడింతై పెరుగుతుంటే, ఆనందిస్తూ, ఇంకా ఎక్కువ పెట్టుబడి అవసరమైతే, వాళ్ళ దగ్గర డబ్బు సరిపోక, కంపెనీలో కొంత షేర్ కేపిటల్ పబ్లిక్ ఆఫర్ చేస్తారు! ఆ షేర్లు లిస్టింగ్ అయ్యాక, వాటి విలువ పెరుగుతుంది (మార్కెట్ మాయాజాలం వల్ల--తగ్గినా తగ్గచ్చు!) కానీ, అసలు కంపెనీ పెట్టిన వాళ్ళు కొంత శాతం షేర్లు తమ దగ్గరే వుంచుకున్నారు కదా? వారి సంపద ఇబ్బడి ముబ్బడిగా పెరిగినట్లు! (ఫోర్బ్స్ మేగజైన్ లాంటివి ప్రపంచంలో అత్యంత ధనికుడు అని ప్రకటిస్తూ వుంటాయి) కానీ, గోతిలో బంగారానికీ, వీటికీ తేడా యేమి వుంది? ఆ షేర్లు అప్పుడు అమ్మితే కదా--అంత డబ్బు వచ్చేది? అదీ సంగతి!

మరి చిదంబరానికీ నాకూ ఏ కంపెనీలున్నాయని సెన్సెక్స్ పెరిగితే అంత ఆనందం?

వాపుని బలుపుగా చూస్తూ, దేశ ఆర్ధిక వృద్ధి అంతా సెన్సెక్స్ మీదే ఆధారపడింది అనే విత్త మంత్రిని ఏమనాలి? అంత మేధావి అయిన మన ప్రధాని చెయ్యగలిగింది మాత్రం యేముంది? వేరే వుద్దేశ్యాలున్న వాళ్ళది కంట్రోల్!

నేను ముందే చెప్పినట్లు ఈ కాంగీరేసు పరిపాలనలోనే ఎందుకు వస్తున్నాయి.....ఈ దరిద్రాలన్నీ? జనతా పాలనలో, ఎన్.డి.ఏ. పాలనలో, వృద్ధి జరగలేదా? ద్రవ్యోల్బణం అదుపులో లేదా?
ఆలోచించండి!

బై ది బై, శ్రీ శ్రీ శత జయంతి సభల్లో కొన్ని చోట్ల, కొంత మంది ఆయన చెప్పిన కవితలూ, ఆయన ఆలోచనలూ ఇంకా, ఇప్పుడుకూడా వర్తిస్తాయా? అన్నారట! మీ అభిప్రాయం?
మరొకసారి వ్రాస్తా!