వివరణ-2
మగాడు సెక్స్ కోసం పెళ్ళికి ఒప్పుకుంటే, స్త్రీ భద్రతకోసం ఒప్పుకుంటుందంటారు! పెళ్ళి జరగ్గానే, మగాడికి భార్య మీద ఓ ఆధిపత్యం వచ్చేస్తుంది! భార్య ‘వద్దు’ అనడానికి వీల్లేదు! పైగా క్రిందితరగతి వాళ్ళకి వున్న టిక్కెట్ అక్కర్లేని వినోదం అదొక్కటే! అందుకని నిర్బంధంగానైనా అనుభవిస్తుంటాడు. పిల్లల్ని కంటూనే వుంటారు—సెక్స్ లో స్త్రీ సంతృప్తి చెందినా, లేకా పోయినా!
సహజీవనంలో ఈ స్థితి వుండదు! ముందుగా ఇద్దరూ ఒకరిని ఒకరు అన్నివిధాలా బాగా ఇష్టపద్దాక, ముందుగానే సెక్స్ లో కూడా ఇద్దరూ సంతృప్తి చెందుతున్నారని నమ్మకం కలిగాకే సహజీవనానికి అంగీకరించవచ్చు!
ఇలా కాకపోతే, ఒకళ్ళకి ఒకళ్ళు నచ్చిన తరవాత, పూర్తిగా అర్ధం చేసుకునేవరకూ సెక్స్ ప్రసక్తి లేకుండా కూడా సహ జీవనంచెయ్యవచ్చు! పూర్తిగా నమ్మకాలు కుదిరితేనే సెక్స్ కి పరస్పరం అంగీకరించవచ్చు!
సహజంగా, ఇద్దరూ స్వేచ్చగా మాట్లాదుకొని, పిల్లల్ని కనడమా వద్దా నిర్ణయించుకోవచ్చు! వద్దనుకున్నంతకాలం నియంత్రణ పద్ధతులు వుండనే వున్నాయి!
యేడాది తిరగకుండా బిడ్డని యెత్తుకోవాలనే ఒత్తిడి వుండదు! స్త్రీకి ‘వద్దు’ అనడానికి సర్వ హక్కులూ వుంటాయి!
మరి జనాభా పూర్తిగా అదుపులోకి వచ్చెయ్యదూ?
దీన్ని చట్టబద్ధం చేస్తే, ఒడంబడిక వ్రాతలో వుండి రిజిష్టరు అయి వుంటుంది గనక, షరతులు ఉభయుల్లో యెవరు ఉల్లంఘించినా, చట్టబద్ధంగానే విడిపోవచ్చు—విడాకుల తతంగం కొనసా………గకుండా! (పిల్లల విషయం కూడా ఒప్పందంలో వుంటుందికదా!)
పట్టణాల్లోను, నగరాల్లోనూ ఇప్పుదు ఇలాంటివి జరుగుతూనే వున్నాయి—చట్టం లేకుండా, లిఖిత ఒడంబడిక లేకుండా!
ఓ స్త్రీ, ఓ పురుషుడూ ఒక బిడ్డతొ మీ పక్క అపార్టుమెంటు అద్దెకి తీసుకుని, సామానుతో సహా దిగి, మగాడు ఉద్యోగానికో, వ్యాపారానికో వెళ్తూ, బిడ్డ స్కూలుకి వెళ్తు వస్తూ వుంటే, అది ముచ్చటైన కుటుంబం అనుకుంటారా లేక ఆ మగాడు బిడ్డతో సహా వున్న స్త్రీని లేపుకొచ్చాడనుకుంటారా?
అలాంటి సహజీవనాలెన్ని లేవు?