Wednesday, July 21

తెలుగోడు

బాబ్లీ

చంద్రబాబు యాత్ర "సుఖాంతం" అయి, కేర్ హాస్పిటల్ కి చేరింది.

రోశయ్య, 'మహారాష్ట్ర పోలీసులు కాస్త అతిగా ప్రవర్తించినట్లు అనిపిస్తోంది' అనలేదింకా!

చిన్నా చితకా కాంగీరేసు రా నా లు మాత్రం, "చంద్రబాబు అరెస్టు అయితేనే ఆత్మహత్యలు చేసుకొంటున్నారట. ఇక చనిపోతే (పాపం శమించుగాక) యెన్ని లక్షలమంది చనిపోతారో?" అనివ్యాఖ్యానిస్తూ, ప్రజలు వీళ్ళనీ, వీళ్ళ వ్యవహారాన్నీ చూసి, దేనితో నవ్వుతున్నారో చూడడం లేదు.

జేపీ కూడా, చంద్రబాబుది రాజకీయం అనడానికి వీల్లేదు అంటున్నాడు.

మామూలుగానే, నాక్కొన్ని సందేహాలు.

1. 2004 ఆగష్టు లో బాబ్లీ శంకుస్థాపన జరిగినప్పుడు, అధికారం లో వున్న వై యెస్, "మహారాష్ట్ర ముఖ్యమంత్రిని మందలించమని సోనియా ని అడగడం బాగోదు కదా?" అనీ, "ఓ రెండుమూడు లక్షల మంది తో మహారాష్ట్ర మీద యుధ్ధానికి వెళ్ళలేము కదా?" అనీ వ్యాఖ్యానించి, మనరాష్ట్రం '....క్రిందికి' నీళ్ళు చేరుతున్నా, మిన్నకుండిపోయారని వీళ్ళు (కాంగీరేసులు) మరిచిపోయారా?

2. జడ్ ప్లస్ కేటగరీ లో వున్న చంద్రబాబు రక్షకులు, ఆయన మీద లాఠీ చార్జీ జరిగి చొక్కా చిరిగి పోతే, పరుగెత్తుకుంటూ వెళ్ళి ఆయన చుట్టూ రక్షణ వలయాన్ని నిర్మించారట. మిగిలిన నాయకుల అంగరక్షకుల్ని పోలీసులు తరిమికొడుతూంటే, పొలాల వెంబడి పరుగెత్తారట!

యెందుకలగ?

==> ఓ అంగ రక్షకుడు, తన తుపాకీని గాలిలోకి పేల్చి, పోలీసుల్ని హెచ్చరిస్తే, వాళ్లు ఆగిపోయేవారు కదా?

ఇంకా వాళ్లు ఆగకపోతే, ఓ నలుగురైదుగుర్ని వేసేస్తే, ఇంకా మాట్లాడితే, నాందేడ్ కలెక్టర్నీ, ఎస్ పీ నీ కూడా వేసేస్తే, యెలా వుండేది?

(చట్ట ప్రకారం, అంగరక్షకులు చేసే పనికి నాయకులే బాధ్యత వహించాలంటారా? మన రా నా లకి, కేసులూ, కోర్టులూ యేమీ కొత్త కాదు కదా? గాంధీగారు మన రా నా లకి ఆదర్శం కానీ, అంగరక్షకులకి కాదు కదా?)

3. 'పిలుపు తక్కువయ్యింది' అని అలిగి వెళ్ళలేదు అని చెప్పిన చిరంజీవి, ఇప్పుడు '23న అఖిలపక్షం వుండగా వెళ్ళడం ఆయన తొందరపాటే' అంటున్న చిరంజీవి, నిజం గా యాత్రకి వెళ్ళి వాళ్ళతో వుండి వుంటే--యేమి జరిగేది?

ఆయన అభిమానులూ, కార్యకర్తలూ ఈపాటికి యేమి చేసేవారు?

(ఇంకా సందేహాలు వున్నాయి గానీ, ఇవే ముఖ్యమైనవి)

ఇక చెయ్యవలసింది?

రెండురోజుల్లో ప్రథానితో జరగవలసిన అఖిలపక్షం భేటీని ఇంకో మూడు రోజులు పొడిగించి, 26 కి మార్చారు.

ఇక విపక్షాలన్నీ, ఈ భేటీని బహిష్కరించండి. ప్రథానీ, అధిష్టానం దిగి వచ్చి, అఖిలపక్షాన్ని హైదరాబాదులోనే కలవమనండి--జరిగిందానికి క్షమాపణ చెప్పాక!

ఆ భేటీ కి మరాఠీ ముఖ్యమంత్రిని కూడా రప్పించమనండి. 

వాడు రాగానే, అంగ రక్షకులతోసహా విమానాశ్రయం లోనే బంధించి, బందెలదొడ్లో పెట్టి కుళ్ళబొడవమనండి.

అప్పటిదాకా, కాంగీరేసుల్తో అన్ని అధికార, అనధికార సమావేశాల్నీ బహిష్కరించండి.

యేం జరుగుతుందో చూడండి.
 

10 comments:

Anonymous said...

తెలుగోడు వా తెలివిలేనివాడివా ??

Anonymous said...

పరమ దరిద్రమైన నీతిమాలిన దిక్కుదివాణం లేని బ్లాగులు రాసి నీ గౌరవాన్ని నువ్వె మంటగలుపుకోకు. జనాలు కాంగ్రెస్సోళ్ళని చూసి దేంతో నవ్వుతున్నారో దాంతో ఆలోచించికాదు బుర్రతో ఆలోచించి రచనలు చేయి.

amma odi said...

కృష్ణశ్రీ గారు... మంచి సందేహాలు వెలిబుచ్చారు.

Anonymous said...

Majority community in this country are like sheep and buffalows. They are divided based on Castes, Language, Region and political ideology. One Italian ruling over one Billion Indians because of this.

It took 10,000 British (at any given time) to rule India (300 Million people at that time), but one Italian is ruling one Billion people now.

A K Sastry said...

ఇద్దరు పినాకొ లూ!

1. మరి నువ్వోడివో?

2. ముక్కూమొహం లేనివాళ్ళని నేను లెఖ్ఖ చెయ్యనని చెప్పాను--ఇదివరకే!

బుర్రుంటే, సమాధానాలు వ్రాయండి.

A K Sastry said...

డియర్ AMMA ODI!

సంతోషం.

యెవరైనా సమాధానాలు వ్రాస్తారేమో అని యెదురు చూస్తున్నా.

చూద్దాం!

A K Sastry said...

ఇంకో Anonymous!

పాపం జనాలనెందుకు తిడతారు--తిట్టవలసినవాళ్ళని వొదిలేసి?

ఓబుల్ రెడ్డి said...

మీతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. మనలో మనం మనవాళ్ళని తిట్టుకునే సమయం కాదిది. అవతలివాళ్ళకి తెలుగోడి దెబ్బ రుచి చూపించాల్సిన సమయం. మన తెలంగాణ జిల్లాలు ఎండిపోకుండా చూడ్డానికి ఆంధ్రులమంతా నడుం కట్టాల్సిన సమయం. ఇక్కడ పార్టీల గొడవలూ, ప్రాంతీయ గొడవలూ, నాయకులపై వ్యక్తిగత కక్షలూ, నిందలూ మాట్లాడేవారు తెలుగుజాతిద్రోహులు. కాల్చేపారెయ్యాలి అలాంటి పనికిమాలిన దరిద్రపు నీచవెధవల్ని. వాళ్ళు తెలుగుబ్లాగరులైనా సరే !

డెబ్బైమంది టి.డి.పి. ఎమ్మెల్యేలూ కాదు, చిత్తూరు నుంచి శ్రీకాకుళం దాకా ఉన్న తెలుగుజాతి అభిమానులం అందఱమూ మిలియన్లాది మందిమి ఒకేసారి కట్టగట్టుకొని మహారాష్టలోకి చొఱబడదాం. అప్పుడు మహారాష్ట్రవాళ్లు ఏం పీకుతారో చూద్దాం. ఎవఱు ఎవఱిని చితక్కొడతారో అదీ చూద్దాం.

వాసు.s said...

@ఓబుల్ రెడ్డి,
అల్రెడీ మీరు వేరు మేము వేరు, మీ జాతి వేరు మా జాతి వేరు, మీ తల్లి వేరు మా తల్లి వేరు అని ఒక ముక్కాయన నేత్రుత్వంలో మనల్ని హైదరబాద్ లో పిచ్చకొట్టుడు కొట్టారుగా... మళ్ళీ మీ జిల్లాలు ఎండిపోతున్నాయని పోరాటానికి మనమెళ్ళామనుకో, మహరాష్ట్ర సరిహద్దులు చేరకముందే మీరెవర్రా మమ్మల్ని కాపాడేది, పోరాటల పురిటిగడ్డ మాది, ఎండినా, పండినా మా యిష్టం అన్నారనుకోండి, తలెక్కడ పెట్టుకోవాలంటారు?

A K Sastry said...

డియర్ ఓబుల్ రెడ్ది; వాసు.s!

ఆవేశాలతోనూ, మిలియన్లాది మంది తోనూ పరిష్కారమయ్యే సమస్యలు కాదు ఇవి.

యేమి చేసినా, ప్రజాస్వామ్య పధ్ధతిలోనే చెయ్యాలి.

చెయ్యగలిగితే, జరగబోయే వుప యెన్నికల్లో--రెండు మూడుసార్లుగా యెన్నుకోబడీ, రాజీనామా సమర్పించీ, మళ్ళీ యెన్నుకోబడి--ఇలా ప్రజాస్వామ్యాన్ని పరిహసిస్తున్న రాజకీయ పార్టీలవారికి ఒక్క వోటూ రాకుండా, పార్టీ గుర్తులేని యే మూలనున్న ముసలమ్మనైనా యెన్నుకొనేలా చెయ్యండి! యే రాజకీయ పార్టీకి ఒక్కసీటు కూడా రాకూడదు.

అప్పుడెవడు ప్రత్యేక/సమైక్య వాదనలు చేస్తాడో చూద్దాం.

బొర్రముక్కోడికి చాపకింద నీళ్ళొస్తే, ఇంకేమి మాట్లాడతాడు?

శ్రీకృష్ణ కమిటీ తుంగలో తొక్కబడుతుంది.

అధిష్టానం ఇంకెప్పుడూ గేములాడదు--తెలుగువాళ్ళతో!

ప్రయత్నించండి--లేదా సాధారణ యెన్నికలవరకూ ఆగండి.

ఈ లోగా రాజకీయాలు చూసి మోసపోకుండా--ఈ వేడిని అలాగే వుండనివ్వండి.